ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వస్తున్న భూకబ్జా ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో రూ.500 కోట్ల విలువచేసే 10 ఎకరాల భూమిని పవన్ కబ్జా చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై ఇప్పటికే జనసేన తీవ్రంగా స్పందించింది. తాజాగా టాలీవుడ్ నిర్మాత, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి ఈ ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్ జీవితం ఎల్లప్పుడూ త్యాగం, నిజాయితీ, అచంచలమైన ప్రజా సేవకు ఒక ఓపెన్ బుక్ లాంటిదని రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతకు సరిపోలలేక, ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఎన్ని చేసినా, ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని తగ్గించలేవన్నారు. ఈ మేరకు నిర్మాత రామ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.“మన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీవితం ఎల్లప్పుడూ త్యాగం, నిజాయితీ, అచంచలమైన ప్రజా సేవకు ఒక ఓపెన్ బుక్ లాంటిది. అసత్యాలు హెడ్ లైన్స్ సృష్టించవచ్చు, కానీ సత్యం విశ్వాసాన్ని సంపాదిస్తుంది. పవన్ కళ్యాణ్ పై ప్రచారం చేస్తున్న కల్పిత భూకబ్జా ఆరోపణలు వాస్తవాల నుండి కాకుండా, రాజకీయ నిరాశ నుండి పుట్టినవి. ఒక నాయకుడి విశ్వసనీయత, నిస్వార్థత, ప్రజల నమ్మకాన్ని సవాలు చేయడం అసాధ్యమైనప్పుడు.. అప్పటికే రాజకీయ పోరాటంలో ఓడిపోయిన వారికి వ్యక్తిత్వ హననం చేయడమే చివరి మార్గంగా మారుతుంది”“ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతకు సరిపోలలేక, ప్రజలలో ఆయనకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోలేక, వారు తప్పుడు సమాచారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వస్తున్న భూకబ్జా ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో రూ.500 కోట్ల విలువచేసే 10 ఎకరాల భూమిని పవన్ కబ్జా చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై ఇప్పటికే జనసేన తీవ్రంగా స్పందించింది. తాజాగా టాలీవుడ్ నిర్మాత, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి ఈ ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్ జీవితం ఎల్లప్పుడూ త్యాగం, నిజాయితీ, అచంచలమైన ప్రజా సేవకు ఒక ఓపెన్ బుక్ లాంటిదని రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతకు సరిపోలలేక, ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఎన్ని చేసినా, ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని తగ్గించలేవన్నారు. ఈ మేరకు నిర్మాత రామ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.“మన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీవితం ఎల్లప్పుడూ త్యాగం, నిజాయితీ, అచంచలమైన ప్రజా సేవకు ఒక ఓపెన్ బుక్ లాంటిది. అసత్యాలు హెడ్ లైన్స్ సృష్టించవచ్చు, కానీ సత్యం విశ్వాసాన్ని సంపాదిస్తుంది. పవన్ కళ్యాణ్ పై ప్రచారం చేస్తున్న కల్పిత భూకబ్జా ఆరోపణలు వాస్తవాల నుండి కాకుండా, రాజకీయ నిరాశ నుండి పుట్టినవి. ఒక నాయకుడి విశ్వసనీయత, నిస్వార్థత, ప్రజల నమ్మకాన్ని సవాలు చేయడం అసాధ్యమైనప్పుడు.. అప్పటికే రాజకీయ పోరాటంలో ఓడిపోయిన వారికి వ్యక్తిత్వ హననం చేయడమే చివరి మార్గంగా మారుతుంది”“ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతకు సరిపోలలేక, ప్రజలలో ఆయనకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోలేక, వారు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ, వ్యక్తిగత దాడుల మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ ఏ దుష్ప్రచారమూ ఆయన జీవితకాల త్యాగాన్ని కప్పిపుచ్చలేదు. ఆయనపై లక్షలాది మంది ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని తగ్గించలేదు” అని రామ్ తాళ్లూరి పేర్కొన్నారు.మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వస్తున్న కబ్జా ఆరోపణలపై పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. జన్వాడ కోడి చెరువు భూమి పట్టా షికం అని, కబ్జా కాదని స్పష్టం చేశారు. 2014లోనే పవన్ ఆ భూమి కొనుగోలు చేశారని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక మ్యుటేషన్ చేయించుకోలేదని, 2020-21లో మ్యుటేషన్ చేయించుకున్నారని చెబుతున్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, కేవలం పంట తోటలు మాత్రమే పెట్టుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనమని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ భూకబ్జా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. అది చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని, అన్ని రకాల రిజిస్ట్రేషన్ అనుమతులు ఉన్నాయని తెలిపారు. 2015 నుంచి క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారని, ఎలాంటి ఆక్రమణలు లేదా చట్టవిరుద్ధ అంశాలు లేవని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్