
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Hallallallo Song Controversy:కొంతమంది ప్రేక్షకులు ఆ పాటలోని కొన్ని స్టెప్పులు అసభ్యంగా ఉన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. 2026లో ఇలాంటి డ్యాన్స్ మూవ్స్ అవసరమా అని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తాజాగా స్పందించాడు. తనకు అసభ్యంగా చూపించే ఉద్దేశం ఎప్పుడూ లేదని స్పష్టం చేశాడు. ‘నాటు నాటు’ పాటను ఎంతగా ఆస్వాదించానో, ‘హల్లల్లల్లో’ పాటను కూడా అదే ఉత్సాహంతో చేశానని చెప్పాడు. పాటలో ఎవరినీ కించపరచడం లేదా అసభ్యంగా చూపించడం తమ లక్ష్యం కాదని వివరించాడు. అలాగే ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పు లేదని కూడా చరణ్ పేర్కొన్నాడు. ఎవరు ఎలా స్వీకరించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. మరోవైపు జాన్వీ కపూర్ కూడా ఈ అంశంపై స్పందించింది. పాటకు ఇలాంటి స్పందన వస్తుందని తాను అసలు ఊహించలేదని తెలిపింది. షూటింగ్ సమయంలో తాము కేవలం దర్శకుడు చెప్పిన విధంగా డ్యాన్స్ చేశామని, అందులో తమకు ఎలాంటి అసభ్యత కనిపించలేదని చెప్పింది. నటీనటులుగా దర్శకుడి విజన్‌ను నమ్మి పనిచేస్తామని జాన్వీ వివరించింది. పాట చిత్రీకరణ సమయంలో ఎలాంటి అభ్యంతరకర భావన కలగలేదని కూడా స్పష్టం చేసింది. ఇదిలా ఇదిలా ఉండగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన ఈ పాటకు మంచి స్పందన కూడా లభిస్తోంది. ఒకవైపు విమర్శలు వస్తుండగా, మరోవైపు పాటలోని ఎనర్జీ, సంగీతం, డ్యాన్స్‌ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి. అయితే విడుదలకు ముందే ‘హల్లల్లల్లో’ పాట చుట్టూ ఏర్పడిన వివాదం మాత్రం సినిమాకు మరింత ప్రచారం తీసుకొచ్చిందనే చెప్పాలి. Also Read: స్టార్ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి..ఎట్టకేలకు పెళ్లిపై స్టార్ కమెడియన్ క్లారిటీ! Also Read: బాలకృష్ణ చిన్న కూతురు ఒక్క వీడియోతో పాపులర్..ఆమె గురించి ఈ విశేషాలు తెలుసా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్,...