
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Ketu Transit In Magha Nakshatra 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహాన్ని ఛాయాగ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. అంతే కాకుండా దీనిని రహస్యం ఆధ్యాత్మికతకు కారక గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ గ్రహం ఎల్లప్పుడూ వక్రగతిలో ఒక రాసి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తుంది. ఇదిలా ఉంటే.. కేతువు గ్రహం మే 31వ తేదీన ఆదివారం తెల్లవారి జామున రెండు గంటల సమయంలో మాగ నక్షత్రంలోని మూడవ దశలోకి సంచారం చేసింది.. ఈ గ్రహం ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా ఇదే స్థితిలో కొనసాగుతూ ఉంటుంది. అయితే, కేతువు సంచారం నాలుగు రాశుల వారికి అనేక సవాలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆయా రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. దీంతోపాటు దీర్ఘకాలిక సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.. కాబట్టి ఈ సమయంలో ఏ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. మిథున రాశి కేతువు స్థానంలో మార్పులు రావడం కారణంగా మిధున రాశి వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.. తప్పుడు మాటలు వివాదాలకు దారి తీయవచ్చు మిథున రాశి కేతువు స్థానంలో మార్పులు రావడం కారణంగా మిధున రాశి వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.. తప్పుడు మాటలు వివాదాలకు దారి తీయవచ్చు పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారాలు చాలా కష్టంగా మారే అవకాశాలుంటాయి కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి కొంత డబ్బులపరంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే మీ మనస్సు కూడా అశాంతిగా మారవచ్చు. కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కేతువు స్థానంలో మార్పుల కారణంగా మానసికంగా ఊహించని స్థాయిలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అంతేకాకుండా ఊహించని ఆందోళన వంటి సమస్యలు కూడా ఇవ్వవచ్చు అలాగే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే అనేక సమస్యలకు దారి తీయవచ్చు ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. లేదంటే పనుల మధ్య సమతుల్యత లేకపోవడం కారణంగా ఇతర సమస్యలకు దారి తీయవచ్చు.. సమాజంలో మాట తీరు పట్ల ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ధనస్సు రాశి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కేతువు ప్రభావం ఎంతో ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పనిలో కష్టపడటానికి వెనకాడకండి.. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో కష్టపడితేనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. లేదంటే అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పాత ప్రాజెక్టులు ఈ సమయంలో ప్రారంభించడం మంచిది లేదంటే వాటిలో కూడా నష్టాలు కూడా వస్తాయి. ఆస్తి సంబంధిత సమస్యలు ఉన్నవారు తప్పకుండా కొంత వేచి చూడాల్సి ఉంటుంది. మీన రాశి కేతువు సంచార ప్రభావంతో మీన రాశి వారికి ఈ సమయం ఎంతో ఆశుభ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అధిక ఆందోళన కారణంగా అసౌకర్యాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండకపోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.. జీవితంలో ఆకస్మిత హెచ్చుతగ్గులు కూడా పెరుగుతాయి. ఇప్పటికే శని ప్రభావంతో బాధపడుతున్న ఈ రాశి వారు ఈ సమయంలో మరిన్ని సమస్యల బారిన పడాల్సి వస్తుంది. Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.