
Home » Telangana » Hyderabad » Telangana HILTP Policy Clears Transformation Of Industrial Lands Around Hyderabad ORR suri ABN , Publish Date - May 23 , 2026 | 08:40 PM హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ప... రాష్ట్ర సచివాలయంలో హెచ్ఐఎల్టీపీ విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్లైన్లో విడుదల చేశారు. ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP) విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో హెచ్ఐఎల్టీపీ విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్లైన్లో విడుదల చేశారు. ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP) విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో హెచ్ఐఎల్టీపీ విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో 9,292 ఎకరాల పరిశ్రమల భూముల మార్పిడికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన తెలిపారు. పాత ఇండస్ట్రియల్ ల్యాండ్స్‌కు మల్టీ-యూజ్ జోన్ హోదా ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఐటీ పార్కులు, నివాస ప్రాజెక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు అవకాశం కల్పించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆస్పత్రులు, విద్యాసంస్థల ఏర్పాటుకూ హెచ్ఐఎల్టీపీతో వెసులుబాటు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పరిశ్రమల యజమానులతో మంత్రి కీలక సమావేశం నిర్వహించారు. హెచ్ఐఎల్టీపీ అమలుపై పరిశ్రమల యజమానుల అభిప్రాయాలను ఆయన సేకరించారు. విధివిధానాలు పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని.. సలహాలు, సూచనల కోసం త్వరలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎండీ శశాంక హాజరయ్యారు. విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. మీ కరెంట్‌ను ఇక అమ్ముకోవచ్చు.. ఎనర్జీ ట్రేడింగ్‌ను తెచ్చిన స్టార్టప్ ‘రెంజీ’
Summary status: pending