
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవాళ్లెవరో చెప్పు.. నీవు ఎలాంటివాడివో నేను చెబుతా అని ఒక రచయిత అంటారు. అలాగే ఒక సభలో ప్రసంగించిన వక్తలు ఎవరో చెప్పు..ఆ సభ ఎలాంటిదో నేను చెబుతా అన్నది సరికొత్త నానుడిగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు నిర్వహించుకుంది. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కొన్ని చోట్ల కార్యకర్తలు వచ్చారు.. కొన్ని చోట్ల Jun 1 2026 11:20 AM | Updated on Jun 1 2026 11:41 AM నీ చుట్టూ ఉన్నవాళ్లెవరో చెప్పు.. నీవు ఎలాంటివాడివో నేను చెబుతా అని ఒక రచయిత అంటారు. అలాగే ఒక సభలో ప్రసంగించిన వక్తలు ఎవరో చెప్పు..ఆ సభ ఎలాంటిదో నేను చెబుతా అన్నది సరికొత్త నానుడిగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు నిర్వహించుకుంది. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కొన్ని చోట్ల కార్యకర్తలు వచ్చారు.. కొన్ని చోట్ల సరిగా రాలేదు. జనాన్ని పోగు చేసే యత్నాలు చేశారు. కొన్ని చోట్ల చీరెలు కూడా పంచారు.. రికార్డింగ్ డాన్స్ లు నిర్వహించారు... గుడి, బడి, ప్రభుత్వ ఆఫీస్ దేనిని వదలకుండా ఆయా చోట్ల సభలు నిర్వహించి సరికొత్త ట్రెండ్ ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాలలో ప్రభుత్వ ఆఫీస్ లకు కూడా పచ్చ జెండాలు కట్టారని వీడియోలు వచ్చాయి. ఇదంతా అధికార దుర్వినియోగమే కదా! ఇక మహానాడు ప్రధాన కార్యక్రమంలో ప్రసంగించిన కొంతమంది వక్తలను చూస్తే మతి పోవల్సిందే. కిరాక్ అంటూ ఒకాయన వైఎస్సార్సీపీ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను అసహ్యమైన బూతులతో దూషిస్తుంటారు. ఆయన ప్రసంగించడానికి మహానాడులో అవకాశం ఇవ్వడం అంటేనే ఆ సభ ఇంత నాసిరకంగా జరిగిందా అన్న అభిప్రాయం పలువురికి కలిగింది. ఏభై ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు అలాంటివారితో మాట్లాడించి, ఆసక్తిగా వినడం ఏమిటా అని పలువురు ముక్కున వేలేసుకున్నారు.ఇంకోక నాయకుడు ఎవరో చంద్రబాబు, లోకేష్ లతో పాటు దేవాన్ష్ అందాన్ని పొగుడుతూ ఉపన్యసించారు. బుద్దిగా చదువుకుంటున్న దేవాన్ష్ గురించి కూడా వీరు ప్రసంగిస్తున్నారంటే వీరికి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా పెద్ద సబ్జెక్టు లేదన్నమాట.గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు అధీనంలోకి పార్టీ స్వాధీనం అయిన తర్వాత కూడా కొన్నేళ్లు పార్టీ విధానాలపైన చర్చ జరిగేది. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై తీర్మనాలు చేసి తమ అభిప్రాయాలను తెలిపేవారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా జరిగిన లోటుపాట్లను కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కాని ఈసారి మహానాడులో ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను దూషించడానికి, వైఎస్సార్సీపీపై తప్పుడు ముద్రలు వేసి ఆత్మ సంతృప్తి చెందడానికి, ఆత్మ వంచన చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సహజంగానే ఏ పార్టీ సమావేశంలో అయినా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల విధానాలపై విమర్శలు ఉంటాయి. కాదనం. కాని ఈ మహానాడులో అచ్చంగా వైఎస్సార్సీపీని బూతులు తిట్టడానికే టైమ్ కేటాయించినట్లు కనిపిస్తుంది. అంతే తప్ప తమ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏమిటి? వైఫల్యాలేమిటి? ఎందుకు చెప్పిన హామీలను అమలు చేయలేకపోయాం. వచ్చే మూడేళ్లలో ఏమి చేయాలని అనుకుంటున్నాం.. తదితర అంశాల గురించి పెద్దగా ప్రస్తావించకుండా, అన్నీ చేసేశాం అన్న భ్రమ కల్పించే యత్నం చేశారు. మరో కీలకమైన పాయింట్ ఏమిటంటే గతంలో ఏ సభ పెట్టినా అమరావతి అంటూ తెగ ఊదరగొట్టేవారు. కాని ఈసారి దాని గురించి పెద్దగా ప్రస్తావించినట్లు కనబడదు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో మహానాడుకు ఫుల్ కవరేజీ ఇచ్చినా, ఈ పాయింట్లపై ఫోకస్ పెట్టకపోవడం గమనించదగ్గ అంశమే. ఇప్పటికే