
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Telangana TET 2026 schedule released: తెలంగాణ టెట్ షెడ్యూల్ ప్రకారం.. ఈ పరీక్షలు 2026 జూన్ 16 నుండి 22 వరకు వివిధ సెషన్లలో నిర్వహించబడతాయి. మొత్తంగా ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగుతాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారితంగా జరగబోయే ఈ తెలంగాణ టెట్ పరీక్షలు, మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు షిఫ్టులుగా ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9:00 నుండి 11:30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టైమ్ టేబుల్, ఇతర వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసే అభ్యర్థులు వెబ్సైట్ https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ లోని వివరాలను జాగ్రత్తగా చదువుకోవాలి. పరీక్షల టైమ్ టేబుల్ వివరాలు... జూన్ 16వ తేదీన మొదటి సెషన్లో పేపర్ వన్ మ్యాథ్స్ & సైన్స్ నిర్వహించగా, రెండో షిఫ్టులో కూడా పేపర్ వన్ మ్యాథ్స్ & సైన్స్ ఉంటుంది. జూన్ 17వ తేదీన పేపర్ వన్ మ్యాథ్స్ & సైన్స్, మధ్యాహ్న సమయాల్లో పేపర్ 2 మ్యాథ్స్ & సైన్స్ నిర్వహించనున్నారు. జూన్ 18వ తేదీన మధ్యాహ్నం పేపర్ 2 మ్యాథ్స్ & సైన్స్ పరీక్ష ఉంటుంది. జూన్ జూన్ 19వ తేదీన పేపర్ 2 సోషల్ స్టడీస్‌కు సంబంధించిన పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో జరగనున్నాయి. జూన్ 22వ తేదీన పేపర్ 2 మైనారిటీ లాంగ్వేజ్ (హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం) పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్న సమయాల్లో పేపర్ 1 మైనారిటీ లాంగ్వేజ్ (హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం) పరీక్ష నిర్వహించబడుతుంది. Also Read: నీట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. చరిత్రలోనే తొలిసారి.. రంగంలోకి ప్రధాని మోదీ, ఎయిర్‌ఫోర్స్ హెల్ప్ కూడా? తెలంగాణ టెట్ పరీక్ష కోసం మొత్తం 1,36,418 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరుగుతాయి. ఇందులో పేపర్ 1 కోసం 32,779 మంది, పేపర్ 2 కోసం 86,345 మంది దరఖాస్తు చేసుకోగా, రెండు పేపర్లకు కలిపి 1,73,334 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 28,149 మంది ఇన్-సర్వీస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈ అర్హత పరీక్ష రాయనున్నారు. తెలంగాణ అధికారిక వెబ్సైట్ SCERT లో టైమ్ టేబుల్, ఇతర పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా అభ్యర్థులు అధికారిక సైట్లో చూడవచ్చు. పరీక్షకు హాజరయ్యే వారు ఈ నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షలకు హాజరుకావాలి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి