
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌పై జరిగిన ఒక క్రేజీ అండ్ ఫన్నీ సీక్రెట్‌ను కాజల్ అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. షూటింగ్ గ్యాప్‌లో రామ్ చరణ్ తనను ఎలా ఆటపట్టించేవాడో కాజల్ గుర్తుచేసుకుంది. మగధీర సినిమాలో గుర్రపు స్వారీ సీన్లు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఆ సమయంలో రామ్ చరణ్ తన సొంత గుర్రం ‘బదల్’ను షూటింగ్‌కు తీసుకువచ్చాడు. షూటింగ్ బ్రేక్‌లో తనను ఆ గుర్రంపై ఊరేగించడం ఒకెత్తయితే, ఆ తర్వాత చరణ్ చేసిన అల్లరి మరో ఎత్తు అని కాజల్ పేర్కొంది. సెట్‌పై తాను ఎప్పుడు కనిపించినా రామ్ చరణ్ తన గుర్రం పేరు “బదల్.. బదల్” అని పదేపదే గట్టిగా పిలుస్తూ తనను టీజ్ చేసేవాడని చెప్పుకొచ్చింది. ఆ టైంలో చరణ్ చేసిన ఫన్నీ కామెంట్లు, ఆటపట్టించిన విధానం ఇప్పటికీ తన గుండెల్లో అలాగే గుర్తుండిపోయాయని కాజల్ ఆనందం వ్యక్తం చేసింది. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి...