
ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. రికార్డులతో పాటు కాసుల వర్షంలోనూ మునిగిపోయాడు. కేవలం బ్యాట్‌తోనే కాకుండా సంపాదనలోనూ ఈ బిహార్ కుర్రాడు భళా అనిపించాడు. వేలం పాటలో కేవలం రూ.కోటి పైచిలుకు ధరకే దక్కిన ఈ పరుగుల వీరుడు ఈ ఒక్క సీజన్ ద్వారానే ఏకంగా రూ.రెండున్నర కోట్లకు పైగా ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.మ్యాచ్ ఫీజే ఎక్కువమెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్ల వార్షిక రిటైనర్ ఫీజుకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే అతడికి లభించిన అసలు సంపాదన దీనికంటే చాలా ఎక్కువ. ఐపీఎల్లో ఆడే ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐ రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజును అందిస్తోంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. దీనివల్ల కేవలం మ్యాచ్ ఫీజు రూపంలోనే ఈ కుర్రాడు ఏకంగా రూ.1.20 కోట్లు సంపాదించడం విశేషం.అవార్డులతో కాసుల వర్షంరాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరకపోయినప్పటికీ.. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీలో వైభవ్ అవార్డులను ఊడ్చేశాడు. ఈ సీజన్ ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకొని భారీగా నగదు బహుమతులను అందుకున్నాడు. ఆ వివరాలు చూస్తే:మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్: రూ.15 లక్షలుఆరెంజ్ క్యాప్ (టాప్ స్కోరర్ - 776 పరుగులు): రూ.10 లక్షలుసూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు (దీనితో పాటు టాటా సియెర్రా కార్)సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ (72 సిక్సర్లు): ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. రికార్డులతో పాటు కాసుల వర్షంలోనూ మునిగిపోయాడు. కేవలం బ్యాట్‌తోనే కాకుండా...