
ఇంటర్నెట్ డెస్క్: పదిహేనేళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా 776 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే 72 సిక్సర్లతో అభిమానులను అలరించి పలు అవార్డులను అందుకున్నాడు. మరి ఈ చిన్నోడు తాజా ఐపీఎల్ సీజన్లో ఎంత డబ్బును తన జేబులో వేసుకున్నాడో తెలుసా..! వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ రూ.1.10 కోట్లకు వేలంపాటలో దక్కించుకుంది. ఈ మొత్తంతో పాటు మ్యాచ్ ఫీజులు, పలు రివార్డులూ అతడు సొంతం చేసుకున్నాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా రూ.15 లక్షలు, టోర్నమెంట్లో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నందుకు గాను రూ.10 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలతో పాటు టాటా సియెరా వాహనం, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచినందుకు రూ.10 లక్షలు, అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డ్ సొంతం చేసుకున్నందుకు రూ.10 లక్షలు అందుకున్నాడు. అలాగే అతడి ఒక మ్యాచ్ ఫీజు రూ.7.5 లక్షలు. వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడాడు. ఇలా అతడు రూ.1.20 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్, మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డుల ద్వారా మరికొంత నజరానా పొందాడు. ఇలా మొత్తంగా వైభవ్ సూర్యవంశీ రూ.2.85 కోట్ల కంటే ఎక్కువ మొత్తమే తన ఖాతాలో వేసుకున్నాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఐపీఎల్-19 ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ వేసిన ఇన్సింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి విరాట్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్-19 ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్ వీడియో మీరూ చూడండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఇంటర్నెట్ డెస్క్: పదిహేనేళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా 776 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే 72 సిక్సర్లతో...