
ఏపీ డిప్యూటీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇవి కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారాలని, పవన్ కల్యాణ్ ప్రభావాన్ని చూసి ఓర్వలేకనే ప్రత్యర్థులు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలకు దిగుతున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణలోని శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న భూమి విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జనసేన పార్టీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు.ఈ వివాదంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కల్యాణ్ జీవితం త్యాగం, నిజాయతీ, ప్రజాసేవకు నిలువుటద్దమని, ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని పేర్కొన్నారు. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ఇలాంటి అసత్య ప్రచారాలతో ఆయనపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయలేరని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి నిందలు వేస్తారని విమర్శించారు.జన్వాడలోని వివాదాస్పద భూమిపై పార్టీ నేతలు స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆ భూమిని పవన్ కల్యాణ్ 2014లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని తెలిపారు. అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మ్యుటేషన్ కూడా చేయించుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఆ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని, కేవలం వ్యవసాయ కార్యకలాపాలు, పండ్ల తోటలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని, కబ్జా అనే ఆరోపణ పూర్తిగా నిరాధారమని స్పష్టం ఏపీ డిప్యూటీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇవి కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారాలని, పవన్ కల్యాణ్...