
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కోయంబత్తూరు వ్యాప్తంగా ఆయన మద్దతుదారులు భారీగా ఏర్పాటు చేసిన పోస్టర్లు, అన్నామలై వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. దీనితో పాటు బీజేపీ కీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.పోస్టర్ల కలకలంకోయంబత్తూరులో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు అన్నామలై హాజరుకాకుండా విదేశాలకు వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో నగరమంతటా ఆయన పోస్టర్లు వెలిశాయి. ‘‘భయం లేని మనసులకు హద్దులు లేవు’’ అనే సందేశంతో ఉన్న ఈ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అలాగే ఆయన అభిమాన సంఘం ‘అన్నామలై అన్బు కూట్టం’ రాష్ట్రవ్యాప్తంగా కొత్త సభ్యులను, కార్యకర్తలను చేర్చుకునే పనిని ముమ్మరం చేసింది.కేంద్రంపై అన్నామలై తిరుగుబాటుఇటీవల కేంద్ర విద్యాశాఖ తీసుకున్న ‘త్రిభాషా సూత్రం’ నిర్ణయాన్ని అన్నామలై బహిరంగంగా వ్యతిరేకించారు. సీబీఎస్ఈ 9వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచే మూడు భాషలను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం తమిళనాడు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తుందని, పాత నిర్ణయం ప్రకారం 2029-30 నుంచి మాత్రమే దీన్ని అమలు చేయాలని ఢిల్లీ పెద్దలకు అల్టిమేటం ఇచ్చారు. ఈ లాంగ్వేజ్ పాలసీ వివాదమే ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.మిత్రపక్షంతో గొడవలే కొంపముంచాయా?అన్నామలై 2021 నుంచి తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కోయంబత్తూరు...