
అహ్మదాబాద్: ఐపీఎల్-19 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్‌పై ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో విరాట్ కోహ్లీ (75*; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. వెంకటేశ్ అయ్యర్ (32; 16 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (24; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రజత్ పాటీదార్ (15), జితేశ్ శర్మ (11) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. లక్ష్యఛేదనలో ఆర్సీబీకి శుభారంభం దక్కింది. వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. రబాడ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచిన కోహ్లీ (Virat Kohli) .. తర్వాత చెలరేగాడు. రబాడ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాదేయడంతో 4 ఓవర్లకే స్కోరు 50 దాటింది. తర్వాత వెంకటేశ్ అయ్యర్‌ను సిరాజ్, పడిక్కల్ (1)ని రబాడ పెవిలియన్‌కు పంపారు. కాసేపటికే రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో పాటీదార్, కృనాల్ పాండ్య (1)ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో 10 ఓవర్లకు ఆర్సీబీ 100/4తో నిలిచింది. దూకుడుగా ఆడిన కోహ్లీ అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాది 25 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో విరాట్‌కు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే. నిలకడగా లక్ష్యఛేదనలో ఆర్సీబీకి శుభారంభం దక్కింది. వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. రబాడ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచిన కోహ్లీ (Virat Kohli) .. తర్వాత చెలరేగాడు. రబాడ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాదేయడంతో 4 ఓవర్లకే స్కోరు 50 దాటింది. తర్వాత వెంకటేశ్ అయ్యర్‌ను సిరాజ్, పడిక్కల్ (1)ని రబాడ పెవిలియన్‌కు పంపారు. కాసేపటికే రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో పాటీదార్, కృనాల్ పాండ్య (1)ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో 10 ఓవర్లకు ఆర్సీబీ 100/4తో నిలిచింది. దూకుడుగా ఆడిన కోహ్లీ అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాది 25 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో విరాట్‌కు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే. నిలకడగా ఆడిన టిమ్ డేవిడ్‌ను అర్షద్ వెనక్కి పంపాడు. అప్పటికే ఆర్సీబీ విజయం ఖాయమైపోయింది. కోహ్లీ సిక్స్‌తో విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50*; 37 బంతుల్లో) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), శుభ్‌మన్ గిల్ (10) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన నిశాంత్ సింధు (20) పరుగులు చేసి వెనుదిరిగాడు. జోస్ బట్లర్ (19) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అర్షద్ ఖాన్ (15) రన్స్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3, జోష్ హేజిల్‌వుడ్ 2, భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఐపీఎల్-19 ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ వేసిన ఇన్సింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి విరాట్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్-19 ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్ వీడియో మీరూ చూడండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in ©