
Rajat Patidar Captaincy: ఐపీఎల్ 2026 (IPL 2026) ముగింపు వేడుకలు సరికొత్త చరిత్రకు వేదికయ్యాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) పై ఘనవిజయం సాధించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). ఈ చారిత్రక బ్యాక్-టు-బ్యాక్ టైటిల్ విజయం అనంతరం ఆర్సీబీ నయా కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. Read Also :RCB vs GT Final: ఆ ఒక్క క్యాచ్‌తో మారిన మ్యాచ్ తలరాత! విజయం అనంతరం ప్రెజెంటేషన్ సెర్మనీలో మాట్లాడిన రజత్ పాటిదార్ అత్యంత ఎమోషనల్‌గా కనిపించాడు. “ఆర్సీబీ లాంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుకు కెప్టెన్‌గా ఉండి, ఐపీఎల్ ట్రోఫీని అందుకుంటానని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఇది నా కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైన క్షణం. అంతా విధి రాసినట్లు (Destiny) అనిపిస్తోంది” అని తెలిపాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు గత ఏడాది జ్ఞాపకాలు గుర్తొచ్చాయని, అయితే గతంలో మునిగిపోకుండా ప్రస్తుత మ్యాచ్‌పైనే దృష్టి పెట్టడం ప్లస్ అయిందని చెప్పాడు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడం వెనుక స్పష్టమైన ప్రణాళిక ఉందని పాటిదార్ వెల్లడించాడు. బలమైన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్‌ను పవర్‌ప్లేలోనే దెబ్బతీయడమే తమ వ్యూహమని, బౌలర్లు దానిని అద్భుతంగా అమలు చేశారని కొనియాడాడు. ఈ టోర్నమెంట్లో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి సీనియర్లతో పాటు రసిఖ్ సలామ్, కృనాల్ పాండ్యా, సుయశ్ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి ఆటగాళ్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును విజేతగా నిలిపారని ప్రశంసించాడు. తన బ్యాటింగ్ మరియు కెప్టెన్సీ మెరుగుపడటానికి విరాట్ తన బ్యాటింగ్ మరియు కెప్టెన్సీ మెరుగుపడటానికి విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ వంటి సీనియర్ల సలహాలు ఎంతో సహాయపడ్డాయని పాటిదార్ పేర్కొన్నాడు. “విరాట్ భాయ్ ఎప్పుడూ మైదానంలో యువ ఆటగాళ్లకు వెన్నుదన్నుగా ఉంటాడు. అతని లీడర్షిప్ గైడెన్స్ ఈ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించింది” అని ఆర్సీబీ రన్ మెషీన్‌పై ప్రశంసలు కురిపించాడు. చివరగా ఆర్సీబీ అబిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. “మేము దేశంలో ఎక్కడ ఆడినా అభిమానులు స్టేడియాన్ని హోమ్ గ్రౌండ్లా మార్చేశారు. ఈ ట్రోఫీ వారికే అంకితం” అని చెబుతూ, ఆర్సీబీ ఫేమస్ స్లోగన్‌ను మార్చుతూ “ఈసారి కూడా కప్ మనదే!” (Ee Sala Cup Namde) అంటూ విజయ గర్వంతో సంబరాల్లో మునిగిపోయాడు. DK Shivakumar On IPL : ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. PSG’s Champions League: పారిస్ అల్లర్లు..260కి పైగా వాహనాలు దగ్ధం..780 మందికి పైగా అరెస్టు IPL 2026 : గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం IPL 2026 Winner : కప్ గెలిచిన తర్వాత కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్! IPL 2026 : ఈ ఏడాది IPL ఎంతో ప్రత్యేకం ..ఎలాగో తెలుసా ? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ ముగింపు వేడుకల్లో ఒకే ఒక్క పేరు... ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బిగ్ అప్డేట్... తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంటుంది. తాజాగా రాష్ట్ర బీజేపీ ఫైర్‌బ్రాండ్... అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.... ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కొత్త యాంటీ డ్రోన్ వ్యవస్థను రంగంలోకి... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, ప్రత్యేకమైన... రాశి ఫలాలు – 01 జూన్ 2026 మేష రాశి సంస్థలలో పనిచేసేవారికి, యజమానులకు లాభదాయకమైన... క్రికెట్ ప్రేమికులను గత రెండు నెలలుగా ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 (IPL 2026) ముగియడం తో... అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. పల్నాడు జిల్లాకు చెందిన... బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా... © 1997–2026 AGA Publications Limited. All rights reserved. Rajat Patidar Captaincy: ఐపీఎల్ 2026 (IPL 2026) ముగింపు వేడుకలు సరికొత్త చరిత్రకు వేదికయ్యాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) పై ఘనవిజయం...