
RCB vs GT Final: ఐపీఎల్ 2026 (IPL 2026) ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించి ట్రోఫీ గెలిచినప్పటికీ.. మ్యాచ్ ముగింపు దశలో విరాట్ కోహ్లీ (Virat Kohli), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మధ్య చోటుచేసుకున్న హై-వోల్టేజ్ డ్రామా హైలైట్‌గా నిలిచింది. మైదానంలో టీమిండియా సీనియర్, జూనియర్ స్టార్ల మధ్య జరిగిన ఈ ‘క్యాచ్’ యుద్ధం క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. Read Also :IPL 2026 Winner : కప్ గెలిచిన తర్వాత కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్! గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన రసవత్తర ఫైనల్ పోరులో ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేళ ఈ ఘటన జరిగింది. గుజరాత్ బౌలర్ అర్షద్ ఖాన్ వేసిన ఆఖరి బంతిని విరాట్ కోహ్లీ గాల్లోకి లేపాడు. మిడ్-ఆఫ్ దిశగా పరిగెత్తుకుంటూ వచ్చిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు వెంటనే దానిని అవుట్‌గా ప్రకటించడంతో గుజరాత్ క్యాంప్ సంబరాల్లో మునిగిపోగా, కోహ్లీ నిరాశగా వెనుతిరిగాడు. పెవిలియన్ వైపు కొద్ది దూరం నడిచిన కోహ్లీ, గిల్ పట్టిన క్యాచ్‌పై అనుమానంతో వెనక్కి తిరిగాడు. బంతి డైవ్ చేసే క్రమంలో నేలకు తాకినట్లు భావించిన విరాట్.. వెంటనే ఆన్-ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వద్దకు వెళ్లి, థర్డ్ అంపైర్ (TV అంపైర్) రివ్యూ కోరాలని తీవ్రంగా డిమాండ్ చేశాడు. కోహ్లీ గట్టిగా నిలదీయడంతో అంపైర్లు ఆ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు బదిలీ చేయక తప్పలేదు. టీవీ రీప్లేలో విభిన్న కోణాల నుంచి ఆ క్యాచ్‌ను థర్డ్ అంపైర్ చాలా నిమిషాల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. టీవీ రీప్లేలో విభిన్న కోణాల నుంచి ఆ క్యాచ్‌ను థర్డ్ అంపైర్ చాలా నిమిషాల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. గిల్ వేళ్లు బంతి కింద ఉన్నాయా లేదా బంతి ముందే నేలకు తాకిందా అనే కోణంలో సుదీర్ఘ తనిఖీ జరిగింది. చివరకు బంతి భూమిని తాకినట్లు (Soft Signal/Ground Touch) స్పష్టమవ్వడంతో స్క్రీన్‌పై ‘నాట్ అవుట్’ అని ప్రకటించారు. ఈ నిర్ణయంతో కోహ్లీ గాల్లోకి చేతులు ఊపుతూ సంబరం చేసుకోగా.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన వేళ్లు బంతి కిందనే ఉన్నాయని, అది క్లీన్ క్యాచ్ అని విరాట్ కోహ్లీతో గిల్ నేరుగా మైదానంలోనే వాదనకు దిగాడు. ఇద్దరు అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు, ఐపీఎల్ ఫైనల్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ఇలా సుదీర్ఘంగా వాదించుకోవడం స్టేడియంలోని అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. A chat between Virat Kohli and Shubman Gill on the catch. – The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy Nellore district news: రోడ్డు ప్రమాదంలో సిమ్స్ హాస్పిటల్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ మృతి Rajat Patidar Captaincy:కెప్టెన్‌గా ట్రోఫీ అందుకుంటానని ఊహించలేదు! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. PSG’s Champions League: పారిస్ అల్లర్లు..260కి పైగా వాహనాలు దగ్ధం..780 మందికి పైగా అరెస్టు DK Shivakumar On IPL : ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి IPL 2026 : గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం IPL 2026 : ఈ ఏడాది IPL ఎంతో ప్రత్యేకం ..ఎలాగో తెలుసా ? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ ముగింపు వేడుకల్లో ఒకే ఒక్క పేరు... ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బిగ్ అప్డేట్... అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.... తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంటుంది. తాజాగా రాష్ట్ర బీజేపీ ఫైర్‌బ్రాండ్... ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కొత్త యాంటీ డ్రోన్ వ్యవస్థను రంగంలోకి... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, ప్రత్యేకమైన... రాశి ఫలాలు – 01 జూన్ 2026 మేష రాశి సంస్థలలో పనిచేసేవారికి, యజమానులకు లాభదాయకమైన... భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా (బాలెన్ షా) పార్లమెంటులో చేసిన... అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. పల్నాడు జిల్లాకు చెందిన... బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా... © 1997–2026 AGA Publications Limited. All rights