
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థ ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబయిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో 'ఎయిర్‌ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్'ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ విజ్ఞప్తి చేశారు.ఈ భేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "విశాఖపట్నం వేగంగా ఏఐ, డేటా హైపర్‌స్కేల్ హబ్‌గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీకనెక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అన్ని విధాలా అనుకూలమైన నగరం. ఇక్కడ 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పాలన్నది మా లక్ష్యం. మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై మేం ప్రత్యేక దృష్టి సారించాం" అని వివరించారు. భారతదేశంలో మరే ఇతర ప్రాంతంలో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయని, డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ కోసం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు కూడా సిద్ధంగా ఉన్నాయని లోకేష్ తెలిపారు.ఎయిర్‌ట్రంక్‌ను ఏపీకి తీసుకురావాలన్న ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తొలిసారి రాబిన్ ఖుదాతో సమావేశమై ఏపీ దార్శనికతను వివరించారు. ఆ తర్వాత ఎయిర్‌ట్రంక్ బృందం, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. అయితే, భారత్‌లో కార్యకలాపాలకు ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా...