
Coal India Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) లో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. అయితే ఈ ఏడాది నుంచి గేట్ (GATE) స్కోర్‌కు బదులుగా, సంస్థ సొంతంగా నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా నియామకాలు జరగనున్నాయి. అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు జూన్ 11, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. • ఉద్యోగ గ్రేడ్ : E-1 గ్రేడ్ (ఎగ్జిక్యూటివ్ లెవెల్) • మొత్తం ఖాళీలు: 660 (CBT విధానంలో ఎంపిక) (ఇవి కాకుండా మైనింగ్ విభాగంలో 276 పోస్టులను GATE ద్వారా భర్తీ చేస్తారు) • దరఖాస్తు విధానం : కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే • జీతం వివరాలు : నెలకు రూ.60,000/- నుంచి రూ.1,80,000/- వరకు • ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం : 12 మే 2026 (ఉదయం 10:00 గంటల నుంచి) • ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ : 11 జూన్ 2026 (సాయంత్రం 06:00 గంటల వరకు) • వయోపరిమితిని లెక్కించే తేదీ : 30 ఏప్రిల్ 2026 వరకు • రాత పరీక్ష (CBT) జరిగే అవకాశం : జూలై 2026 (అంచనా మాత్రమే. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తారు.) వివిధ విభాగాల్లో మొత్తం ఖాళీలు, రిజర్వేషన్ల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (Electrical) - పోస్ట్ కోడ్: 12 (మొత్తం: 221) • సివిల్ ఇంజనీరింగ్ (Civil) - పోస్ట్ కోడ్: 11 (మొత్తం: 178) • మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical) - • మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical) - పోస్ట్ కోడ్: 13 (మొత్తం: 145) • సిస్టమ్స్ (IT / Computer Science) - పోస్ట్ కోడ్: 14 (మొత్తం: 43) • ఎలక్ట్రానిక్స్ & టెలికాం (E&T) - పోస్ట్ కోడ్: 15 (మొత్తం: 38) • జియాలజీ (Geology) - పోస్ట్ కోడ్: 16 (మొత్తం: 15) • ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (Industrial) - పోస్ట్ కోడ్: 17 (మొత్తం: 11) • రాజ్‌భాషా (హిందీ) - పోస్ట్ కోడ్: 18 (మొత్తం: 5) • కంపెనీ సెక్రటరీ (CS) - పోస్ట్ కోడ్: 19 (మొత్తం: 4) (ప్రతీ విభాగంలో UR, EWS, SC, ST, OBC-NCL, PwBD కేటగిరీల వారీగా ఖాళీలు నోటిఫికేషన్లో పొందుపరిచారు.) గమనిక (మైనింగ్ బ్రాంచ్): మైనింగ్ విభాగానికి చెందిన 276 పోస్టులను ఎప్పటిలాగే గేట్ (GATE) స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తారు. దీనికి దరఖాస్తు గడువు మే 8 నుంచి జూన్ 7 వరకు. 1. విద్యా అర్హత (Educational Qualification): జనరల్/OBC/EWS అభ్యర్థులు కనీసం 60% మార్కులతో, SC/ST/PwBD అభ్యర్థులు 55% మార్కులతో అర్హత గల డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. • ఇంజనీరింగ్ విభాగాలు (Civil, Electrical, etc.): సంబంధిత బ్రాంచ్‌లో B.E / B.Tech / B.Sc (Engineering) పూర్తి చేసి ఉండాలి. • సిస్టమ్స్ (Systems) : CS/ITలో ఫస్ట్ క్లాస్ B.E/B.Tech లేదా ఏదైనా డిగ్రీతో పాటు MCA ఉత్తీర్ణత. • జియాలజీ (Geology): జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో M.Sc./M.Tech. • రాజ్‌భాషా (హిందీ): హిందీలో M.A (కనీసం 60% మార్కులతో). డిగ్రీలో హిందీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి. • కంపెనీ సెక్రటరీ (CS): ఏదైనా డిగ్రీతో పాటు ICSI అసోసియేట్/ఫెలోషిప్ సభ్యత్వం ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు : 2025-26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారి ఫైనల్ ఫలితాలు ఆగస్టు 31, 2026 లోపు వెలువడాలి. 2. వయోపరిమితి (Age Limit - ఏప్రిల్ 30, 2026 నాటికి): • జనరల్ / EWS అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 30 సంవత్సరాలు. • వయోపరిమితి సడలింపులు (కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం): o దివ్యాంగులు (PwBD): ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు సడలింపు ఉంటుంది. o కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి లేదు. కోల్ ఇండియా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుకు ఇంటర్వ్యూ లేదు. అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు: 2. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (Document Verification) 3. ప్రాథమిక వైద్య పరీక్ష (Initial Medical Examination - IME) పరీక్ష 3 గంటల పాటు ఒకే సెషన్లో జరుగుతుంది. మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది. • పేపర్-I (100 ప్రశ్నలు/100 మార్కులు): జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్. •