
‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీకాంత్ ఓదెల. తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీకాంత్ ఓదెల. తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నానితో ‘ప్యారడైజ్’ చిత్రం రూపొందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రెండో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవితో కమిట్ అయిన సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఈ చిత్రానికి నాని నిర్మాత. ‘ప్యారడైజ్’ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ప్యారడైజ్, చిరంజీవి చిత్రాలతో శ్రీకాంత్ పెద్ద ప్లానే వేసినట్లు తెలిసింది. ‘ప్యారడైజ్’కి చిరంజీవి చేయనున్న కథకి ఓ లింక్ ఉందట. అది ప్యారడైజ్ క్లైమాక్స్‌లో రివీల్ అవుతుందని దర్శకుడి సన్నిహితులు నుంచి సమాచారం అందింది. అయితే ఇందులో చిరు నటిస్తారా? లేదా అన్నది కరెక్ట్‌గా తెలీదు కానీ ఆయన పాత్రకు సంబంధించి ఓ లీడ్ అయితే ప్యారడైజ్‌లో ఉంటుందట. దీనికి సంబంధించి మరో న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'ప్యారడైజ్' చిత్రానికి ప్రీక్వెల్ కూడా ఉంటుందట. దీనిని బట్టి చూస్తే శ్రీకాంత్ పెద్ద ప్లానే వేసినట్లు కనిపిస్తోంది. Home » Tollywood » Srikanth Odela’s Big Cinematic Universe Plan ‘Paradise’ Said to Connect with Chiranjeevi’s Next avm ABN , Publish Date - Jun 01 , 2026 | 01:58 PM ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీకాంత్ ఓదెల. తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీకాంత్ ఓదెల. తొలి...