
సంక్రాంతి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశించిన చిత్రాలేవీ రాలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి సిద్ధమయ్యాడు ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్ కథానాయకుడి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. జాన్వీకపూర్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ సంగీతం (peddi songs) అందించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ఈ మూవీ జూన్ 4న (Peddi release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగానే జూన్ 3న (peddi premiere show) రాత్రి 8గంటలకు ప్రీమియర్ షోలతోనూ సందడి చేయనుంది. ఏపీలో ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనుమతులు రాగా, తెలంగాణలో ఏం జరుగుతుందో చూడాలి. పెద్ది రన్ టైమ్ (Peddi run time) సుమారు మూడు గంటలపైనే ఉంటుందని టాక్. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) భారత్‌లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ‘జియో హాట్‌స్టార్’ వేదికగా జూన్ 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. జూన్ 4న రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మిగిలిన దేశాల్లో సినీ అభిమానులు ఈ మూవీని ‘నెట్‌ఫ్లిక్స్’ (Dhurandhar 2 OTT) వేదికగా చూడొచ్చు. మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) కలిసి నటించిన సినిమా ‘పేట్రియాట్’ (Patriot Movie). ఈ మూవీ ‘జీ 5’ (Zee 5) వేదికగా జూన్ 5 (Patriot Movie Streaming date) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుంది. దేశభక్తితో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నయనతార, మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) కలిసి నటించిన సినిమా ‘పేట్రియాట్’ (Patriot Movie). ఈ మూవీ ‘జీ 5’ (Zee 5) వేదికగా జూన్ 5 (Patriot Movie Streaming date) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుంది. దేశభక్తితో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నయనతార, ఫహాద్ ఫాజిల్ లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు. నటుడు అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘కేడీ: ది డెవిల్’ (KD The Devil). యాక్షన్ ప్రియులను అలరించిన ఈ మూవీ ‘జీ 5’ (Zee 5)లో జూన్ 5 (KD The Devil OTT Release date) నుంచి స్ట్రీమింగ్ కానుంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంలో భాషల్లో అందుబాటులోకి రానుంది. రీష్మా హీరోయిన్ కాగా సంజయ్ దత్, శిల్పాశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. సంక్రాంతి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశించిన చిత్రాలేవీ రాలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి సిద్ధమయ్యాడు ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్ కథానాయకుడి బుచ్చిబాబు దర్శకత్వంలో...