
అన్నింటికీ మించి ఓ యోధుడు ఆ జట్టుకు వెన్నెముకగా మారాడు.. ఛేజింగ్ కింగ్ అని ఎందుకంటారో మరోసారి నిరూపించాడు.. తమ తొలి ఐపీఎల్ టైటిల్‌కు ‘ద్వితీయ’ విఘ్నం లేకుండా చేసేశాడు పైన ఉపోద్ఘాతమంతా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఒక్క జట్టుకు ఆడుతూ నిలకడగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్. విజయమో.. వీరస్వర్గమో కాదు. గెలుపే శ్వాస.. గెలుపే లక్ష్యం. ఆర్సీబీ రెండోసారి కప్పును సొంతం చేసుకోవడంలో విరాట్ అండ్ కో పాటించిన సక్సెస్ మంత్ర ఇదే. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై పట్టువిడవకుండా 75 పరుగులతో అజేయంగా చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. ఈ సీజన్లో 675 పరుగులు చేశాడు. అత్యుత్తమ యావరేజీ కూడా విరాట్‌దే కావడం గమనార్హం. ఐపీఎల్ జరిగిన దాదాపు రెండు నెలలూ ఎండాకాలమే. ఎక్కువ మ్యాచులు రాత్రి 7 గంటలకు మొదలైనా సరే.. ఆ ఉక్కపోత తట్టుకోవడం కష్టం. 20 ఓవర్లపాటూ మైదానంలో ఉత్సాహంగా ఉండాలంటే ఫిట్నెస్ అత్యంత కీలకం. ఈ విషయంలో విరాట్ కోహ్లీపై ఒక్క రిమార్కూ ఉండదు. ఇప్పుడున్న కుర్రాళ్ల కంటే జోష్‌గా పరుగులు పెట్టాడు. బ్యాటింగ్ సమయంలోనూ అంతే. సహచరులు ఏమైనా వెనుకడుగు వేస్తే పదమంటూ పరుగులు పెట్టించాడు. సింగిల్ వచ్చే దగ్గర కూడా డబుల్ తీసిన సందర్భాలెన్నో! ‘‘నా అంత ఫిట్నెస్ ఇప్పుడున్న కుర్రాళ్లకూ ఉండదు. మైదానంలో 40 ఓవర్లపాటు ఇటు నుంచి అటు వైపు పరుగులు పెట్టమన్నా పెడతా. సింగిల్, డబుల్స్ తీస్తూ వెళ్లాలని చెబితే అదీ చేస్తా. ఆట కోసం నేనేమీ ప్రత్యేకంగా తయారుకాను. నా దినచర్య ఇలానే ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు రెడీగా ఉంటా’’ ఐపీఎల్ కప్పును సొంతం చేసుకుని ఐపీఎల్ కప్పును సొంతం చేసుకుని ముద్దాడటం బరిలోకి దిగిన క్రికెటర్ కల. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తారు. జట్ల పరిస్థితీ అంతే. అయితే, ఆర్సీబీ అంతే.. కాకపోతే వారిదే ఒకటే లెక్క.. విన్ ఆర్ విన్. గెలవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదనేలా ఈ ఐపీఎల్ సీజన్లో వారి ఆటతీరు ఉంది. అందుకు విరాట్ కోహ్లీ ముందుండి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అక్కడా చివరి వరకూ క్రీజ్‌లో ఉండి గెలిపించాడు. విరాట్ ఔటైతే.. ఆ మోస్తరు స్కోరు కూడా ఆర్సీబీకి కొండంతలా కనిపించేదేమో. అందుకే, ఆ జట్టు గెలిచిన ప్రతి మ్యాచ్‌లోనూ విరాట్ భాగస్వామ్యం ఉంది. అంతర్జాతీయంగా టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్‌లో ఇంకా గెలుపు కాంక్ష మాత్రం తగ్గలేదు. బ్యాటింగ్‌లో అవే మెరుపులు.. మైదానంలో అదే దూకుడుతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడం కోహ్లీ స్పెషల్. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు మాత్రమే ఎక్కువ కాలం ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అందులో ఎంఎస్ ధోని ఒకరు కాగా.. మరొకరు విరాట్ కోహ్లీ. ధోని ఓ రెండు సీజన్లు (సీఎస్కే రద్దు) వేరే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, విరాట్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి సీజన్ నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూ ఉండటం గమనార్హం. అభిమానులు కూడా ఆర్సీబీ అంటే కోహ్లీ అనే స్థాయికి వెళ్లిపోయాడు. కొన్నిసార్లు విఫలమైనా సరే మేనేజ్మెంట్ మద్దతు ఇచ్చింది. ఇక తనకు కెప్టెన్సీ లేకపోయినా సరే బెంగళూరు జట్టుకు ప్రాణం ఇచ్చి మరీ ఆడతాడని మరోసారి రుజువు చేసి చూపించాడు. భారత టీ20 జట్టులో పోటీ తీవ్రం. కానీ, నాణ్యమైన క్రికెటర్ రంగంలోకి దిగితే ఎవరైనా సరే పక్కకు వెళ్లిపోవాల్సిందే. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్, విరాట్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కోహ్లీ ఫామ్, ఫిట్నెస్ను చూశాక.. అతడిని మళ్లీ టీమ్ఇండియాకు తీసుకుంటే బాగుంటుందనే వాదనా మొదలైంది. ప్రస్తుతం విరాట్ కేవలం వన్డేల్లోనే ఆడుతున్నాడనే సంగతి తెలిసిందే. అయితే, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కితే తప్పకుండా బరిలోకి దిగుతానని ఓసారి విరాట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తన బౌలింగ్‌లో స్విచ్ హిట్‌తో సిక్సర్ కొడితే చాలా కోపమొచ్చేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్(IPL) టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఐపీఎల్-19 ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ వేసిన