
ముంబయి: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబయిలో భేటీ అయ్యారు. సాదర స్వాగతం పలికిన సీఎంను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రతిమను లోకేశ్ అందజేశారు. గణేశ్ ప్రతిమను లోకేశ్‌కు సీఎం దేవేంద్ర బహూకరించారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మహారాష్ట్ర సీఎంకి వివరించారు. ఏపీ విద్యా శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాలు తెలియజేశారు. మహారాష్ట్ర ఐటీ, విద్యా శాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలు సీఎంను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వివిధ దేశాల్లో డేటా సెంటర్లు నిర్వహిస్తున్న హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ, డేటా హైపర్‌స్కేల్ హబ్‌గా వైజాగ్ ఆవిర్భవిస్తోందని, గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్లు పురోగతిలో ఉన్నాయని వివరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అన్నివిధాల అనుకూలమైనదని మంత్రి చెప్పారు. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని రాబిన్ ఖుదా హామీ ఇచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. పెనుకొండ, శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. పెనుకొండ, చిన్న కొత్తపల్లి ప్రాంతాల్లో వర్షం కురవడంతో.. వరద నీరు ధర్మవరం చెరువుకు చేరుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదోతరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) గెలవడంతో కర్నూలులో క్రికెట్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ముంబయి: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబయిలో భేటీ అయ్యారు. సాదర స్వాగతం పలికిన సీఎంను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి,...