
నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సాధారణంగా హీరోల పుట్టిన రోజు నాడు కొత్త సినిమా ప్రకటన కానీ, కొత్త టీజర్ కానీ, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించడం కానీ చేస్తుంటారు. కానీ ఈ సారి నిఖిల్ సిద్ధార్థ విషయంలో అలా ఏమి జరగలేదు. ఈ రోజు కూడా అతని సినిమా స్వయంభు (Swayambhu) విడుదల విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమాని నిజానికి గత ఏడాదే విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2026 అని చెప్పారు. కొన్నాళ్ళకు ఏప్రిల్ 10 అని అన్నారు. తర్వాత నిరవధికంగా వాయిదా వేసిన విషయం మనకు తెలుసు. కానీసం పుట్టిన రోజు నాడు అయినా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తారని చూస్తే అదీ లేదు. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల సినిమా ఆలస్యం అవుతోంది అని టీం చెప్తోంది. ఈ రోజు బర్త్ డే ని పురస్కరించుకొని ఒక పోస్టర్ మాత్రం విడుదల చేశారు. నిఖిల్ సిద్ధార్థ రథానికి చెందిన చక్రాన్ని పైకి లేపిన యుద్ధ సన్నివేశంలోని స్టిల్ ఇది. ఈ సినిమాలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపిస్తాడు. ఈ సినిమా విజయం అతనికి కీలకం. పైగా ఇది పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సాధారణంగా హీరోల పుట్టిన రోజు నాడు కొత్త సినిమా ప్రకటన కానీ, కొత్త టీజర్ కానీ, విడుదలకు సిద్ధంగా ఉన్న...