
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు (employees) రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై (transfers) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీలను ఆరు నెలల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం .. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతే కాదు ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని కూడా వాటిలో పేర్కొంది. దీంతో మరో ఆరు నెలల పాటు ఉద్యోగులు ఎక్కడికీ బదిలీపై వెళ్లేందుకు వీల్లేదు. తెలంగాణ ప్రభుత్వం జూన్ 1, 2026 నుండి ఆరు నెలల పాటు ఉద్యోగుల బదిలీలపై పూర్తి నిషేధం విధించిందని ఎక్స్ లో పోస్టు చేసింది. అయితే పదోన్నతులు, కొన్ని అత్యవసర కేటగిరీలకు మాత్రం ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చింది. కేవలం 3 కేటగిరీల ఉద్యోగులకు మాత్రమే ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపింది. ఇందులో పదోన్నతి పోస్టింగ్లు ఇతర ఉద్యోగులను తొలగించకుండా, కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రమే అని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 1, 2026 నుండి ఆరు నెలల పాటు ఉద్యోగుల బదిలీలపై పూర్తి నిషేధం విధించింది. అయితే పదోన్నతులు మరియు కొన్ని అత్యవసర కేటగిరీలకు మాత్రం ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చింది. pic.twitter.com/1UlLWKSBcA అలాగే ప్రత్యేక సందర్భాలుగా పోస్టుల రద్దు, రివర్షన్లు, స్వదేశానికి పంపడం, విదేశీ సేవా డిప్యుటేషన్లు, క్రమశిక్షణా చర్యలు, కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రమేనని తెలిపింది. అలాగే మూడో కేటగిరీ దీర్ఘకాలిక సెలవుపై తిరిగి రావడం. ఆరు నెలలకు మించిన సెలవుపై తిరిగి వచ్చే ఉద్యోగులను కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలలో మాత్రమే నియమించవచ్చని ప్రభుత్వం తెలిపింది. నియామక అధికారులు ఆర్థిక శాఖ అలాగే ప్రత్యేక సందర్భాలుగా పోస్టుల రద్దు, రివర్షన్లు, స్వదేశానికి పంపడం, విదేశీ సేవా డిప్యుటేషన్లు, క్రమశిక్షణా చర్యలు, కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రమేనని తెలిపింది. అలాగే మూడో కేటగిరీ దీర్ఘకాలిక సెలవుపై తిరిగి రావడం. ఆరు నెలలకు మించిన సెలవుపై తిరిగి వచ్చే ఉద్యోగులను కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలలో మాత్రమే నియమించవచ్చని ప్రభుత్వం తెలిపింది. నియామక అధికారులు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా పై మినహాయింపులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయవచ్చని వెల్లడించింది. భవిష్యత్తులో ఏవైనా సడలింపులకు ముఖ్యమంత్రి → ఆర్థిక కార్యదర్శి → ప్రధాన కార్యదర్శి → సంబంధిత మంత్రి → ఆర్థిక మంత్రి నుండి అనుమతి అవసరమని పేర్కొంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు (employees) రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై (transfers) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీలను ఆరు నెలల పాటు...