
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Chandrababu Speech: 'రాష్ట్రాన్ని బాగు చేసేందుకు రాత్రింబవళ్లు మేం (ఎన్డీయే కూటమి) పని చేస్తున్నాం. గత పాలకులు మాత్రం విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. సుపరిపాలనను వెనక్కు లాగేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు కుతంత్రాలు పన్నుతోంది. అందుకే ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నాం' అని వైఎస్సార్సీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 'బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేసి గుండెపోటు అన్నారు. పోస్టుమార్టం తర్వాత తెలిసింది గొడ్డలితో నరికి చంపారని. మానాన్న చనిపోయారు ఇప్పుడు చిన్నాన్న కూడా చంపేశారని ఎక్కడికక్కడ డ్రామాలు ఆడారు. ఒక్కఛాన్స్ అన్నారు మోసం చేశారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు కూడా ఆడారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. కాకినాడ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఐదు సంఘటనలను ప్రజలకు వివరించి వైఎస్సార్సీపీ కుట్రలను సీఎం చంద్రబాబు ఎండగట్టారు. 'ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా ప్రజలు తెలుసుకోవాలి. సుపరిపాలన వైకుంఠపాళీ కాకూడదన్నదే మా విజ్ఞప్తి. గత పాలకులు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 241 కేసులు వేసినా వాటిని పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. గత పాలకులు జాబ్ క్యాలెండర్ అని దానిని ఎగ్గొట్టారు. మళ్లీ మా ప్రభుత్వం వచ్చాకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం' అని సీఎం కాకినాడ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఐదు సంఘటనలను ప్రజలకు వివరించి వైఎస్సార్సీపీ కుట్రలను సీఎం చంద్రబాబు ఎండగట్టారు. 'ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా ప్రజలు తెలుసుకోవాలి. సుపరిపాలన వైకుంఠపాళీ కాకూడదన్నదే మా విజ్ఞప్తి. గత పాలకులు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 241 కేసులు వేసినా వాటిని పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. గత పాలకులు జాబ్ క్యాలెండర్ అని దానిని ఎగ్గొట్టారు. మళ్లీ మా ప్రభుత్వం వచ్చాకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. ఉద్యోగాల భర్తీ 'అత్యంత పటిష్టంగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాం. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాం. 40 వేల ప్రశ్నలు, 25 రకాల ప్రశ్నా పత్రాలు ఎక్కడా అక్రమాలు కాకుండా చూశాం. కానీ ఫ్రస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ వివాదం చేసి రాజకీయ లబ్ది పొందాలని ఆలోచన చేస్తోంది. దీనిని వివాదం చేసి సమాజంలో అశాంతిని రేపేందుకు ప్రయత్నాలు చేసింది. జాగ్రత్తగా ఉండబట్టే దీనికి గట్టిగా సమాధానం ఇవ్వగలిగాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మాది గొడ్డలి పార్టీనే, కత్తులు, కటార్లు తెస్తామని అంటున్నారు. ఇక్కడ ఉన్నది CBN. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క మోడీ గారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని గొడ్డలి పార్టీని హెచ్చరిస్తున్నా.. రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూనే సుపరిపాలన యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాం.… pic.twitter.com/hobkseTI1c — Telugu Desam Party (@JaiTDP) June 1, 2026 'ప్రతిపక్షంలో పరామర్శలకు వెళ్తూ సొంత కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కి చంపేసి పొదల్లోకి విసిరేసి పోయారు. కడపకు చెందిన ఓ పాస్టర్‌ను పంపి హత్యాయత్నం డ్రామాలు ఆడారు. దానిని మాపై నెట్టేందుకు ప్రయత్నించారు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదంలో చనిపోతే దానిని కూడా మాపై నెట్టడానికి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. సీసీ కెమెరాల సాయంతో ఈ కుట్రను బట్టబయలు చేశామని చెప్పారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం 'పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర సాక్షి మీడియా మద్యం బాటిళ్లు తీసుకెళ్లి వేసి అపవిత్రం చేసేందుకు ప్రయత్నం చేశారు. భగవంతుడిని అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నం చేసిన వారిని ఏమనాలి. వారిది వేరే మతం కావొచ్చు దానికి మేం తప్పు పట్టడం లేదు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. కానీ కుట్రలతో హిందూ దేవాలయాలపై దాడులు అపవిత్రం చేయటం సరికాదని హెచ్చరించారు. 'ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి వారిని పట్టుకుని ప్రజల ముందు నిలబెడతాం. కడపలో పెద్ద దస్తగిరిని వైఎస్సార్సీపీ వారే ఆస్తుల వివాదంలో హత్యచేసి టీడీపీ వారిపై నెట్టేందుకు ప్రయత్నం చేశారు నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. అయినా మేం 20 నిముషాల్లో నిందితుడిని పట్టుకున్నాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం