
Balka Suman: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై రాజద్రోహం సెక్షన్ జోడించారు పోలీసులు. BNS 152 సెక్షన్ ను జత పరుస్తూ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. దేశ సమగ్రతకు హాని కలిగించేలా బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారని పోలీసులు వాదించారు. ఈ క్రమంలో రిమాండ్ రిపోర్ట్ లో బాల్క సుమన్ పై BNS 152 సెక్షన్ జోడించారు. ఇటీవల సింగరేణి కాలరీస్ సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో పోలీసులు బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించటంతో పోలీసులు బాల్క సుమన్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. రాష్ట్రంలోని సింగరేణి కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా మిలిటెంట్ చర్యలకు పాల్పడాలి అంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాల్క సుమన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు బాల్క సుమన్ ని అరెస్ట్ చేశారు. Also Read: సభ పెట్టావో సంగతి చూస్తాం..!- పవన్ కల్యాణ్ కు మంత్రి పొన్నం వార్నింగ్.. Telugu » Telangana » Sedition Charge Added Against Brs Former Mla Balka Suman 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Balka Suman: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై రాజద్రోహం సెక్షన్ జోడించారు పోలీసులు. BNS 152 సెక్షన్ ను జత పరుస్తూ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. దేశ సమగ్రతకు హాని కలిగించేలా బాల్క...