
RBI dividend | చండీగడ్: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) ప్రకటించిన డివిడెండ్‌లో రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాలని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా డిమాండ్ చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.87 లక్షల కోట్లను డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చీమా స్పందించారు. RBI dividend | చండీగడ్: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) ప్రకటించిన డివిడెండ్‌లో రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాలని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా డిమాండ్ చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.87 లక్షల కోట్లను డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చీమా స్పందించారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ఆర్థిక ఒత్తిళ్లను కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఎదుర్కొంటున్నాయని చీమా పేర్కొన్నారు. అందువల్ల ఈ అదనపు లాభాలను కేవలం కేంద్రమే తన దగ్గర పెట్టుకోకుండా.. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలకు కూడా పంచాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన ఆర్థిక లోటును తగ్గించుకోవడానికి ఆర్బీఐ నిల్వలను విపరీతంగా వాడటం వల్ల, భవిష్యత్తులో దేశ ఆర్థిక స్థిరత్వానికి రక్షణగా నిలిచే ఆర్బీఐ ఆర్థిక బలం, స్వయంప్రతిపత్తి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్బీఐ వద్ద తగినన్ని నిల్వలు ఉండటం దేశ ఆర్థిక భద్రతకు ఎంతో అవసరమన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending