
Huawei Nova 16 Ultra : హువావే నుంచి సరికొత్త అల్ట్రా ఫోన్ వచ్చేసింది. చైనా మార్కెట్లో కొత్త హువావే నోవా 16 ప్రో లాంచ్ అయింది. ఈ నోవా 16 ప్రోలో 6.84-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. టూ-వే బీడౌ శాటిలైట్ మెసేజింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 7,000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. హువావే నోవా 16 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి. హువావే నోవా 16 ప్రో ధర : హువావే నోవా 16 ప్రో ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,899 (రూ. 51,752) , 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,399 (రూ. 58,400), 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,999 ( రూ. 66,471)గా ఉంది. హువావే నోవా 16 ప్రో స్టార్రీ బ్లాక్, స్కై బ్లూ, వైట్, ఫ్రాస్ట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ హువావే అధికారిక సైట్, వి మాల్లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. హువావే నోవా 16 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : హువావే నోవా 16 ప్రో ఫోన్ (2856×1320) పిక్సెల్స్ రిజల్యూషన్, 1-120Hz ఎల్టీపీఓ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2160Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, కున్లూన్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.84-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. Read Also : Vivo Y200 Pro 5G : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో Y200 ప్రో 5G అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్.. హువావే ఫోన్ టూ-వే బీడౌ శాటిలైట్ మెసేజింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ Telugu » Technology » Huawei Nova 16 Ultra Arrives With 200mp Main Cam And 7000 Mah Battery హువావే ఫోన్ టూ-వే బీడౌ శాటిలైట్ మెసేజింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది. హార్మొనీఓఎస్ 6.1 ఆపరేటింగ్ సిస్టమ్, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,000mAh బ్యాటరీని అందిస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. హువావే నోవా 16 ప్రో బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ వివో ఫోన్ 4K వీడియో రికార్డింగ్, ఏఐ ఆధారిత ఇమేజింగ్ టూల్స్, ఏఐ అసిస్టెంట్ కంపోజిషన్, పోర్ట్రెయిట్ ఎన్హాన్స్మెంట్, టెలిఫోటో ఇమేజ్ ఆప్టిమైజేషన్‌కు సపోర్టు ఇస్తుంది. కిరిన్ 9010S చిప్సెట్తో రన్ అవుతుంది. 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. Huawei Nova 16 Ultra : హువావే నుంచి సరికొత్త అల్ట్రా ఫోన్ వచ్చేసింది. చైనా మార్కెట్లో కొత్త హువావే నోవా 16 ప్రో లాంచ్ అయింది. ఈ నోవా 16 ప్రోలో 6.84-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే...