
Jet fuel price cut | దిల్లీ: విమానయాన సంస్థలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ విమానాల జెట్ ఇంధన (ATF) ధరలను 27 శాతం తగ్గించాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. దేశీయ విమాన ఇంధన ధరల్లో మాత్రం వరుసగా రెండో నెలా ఎలాంటి మార్పూ చేయలేదు. జూన్ నెలకు గాను అంతర్జాతీయ విమానాల జెట్ ఇంధన ధరను కిలోలీటరుకు సుమారు 400 డాలర్ల మేర చమురు సంస్థలు తగ్గించాయి. దీంతో కిలోలీటర్ 1100 డాలర్లకు చేరింది. ఈ తగ్గింపుతో అంతర్జాతీయ విమానాల ఇంధన ధరలు, దేశీయ విమాన ఇంధన ధరలు దాదాపు సమాన స్థాయికి చేరాయి. అంతర్జాతీయ విమాన ఇంధన ధర కిలో లీటరుకు రూ.1,05,000గా ఉండగా.. ప్రస్తుతం దిల్లీలో దేశీయ విమాన ఇంధన ధర కిలోలీటరుకు రూ.1,04,927గా ఉంది. అంతకుముందు దేశీయ విమానాలకు ఏప్రిల్ 1న కిలోలీటరుకు 25 శాతం అంటే రూ.15వేలు చొప్పున పెంచగా.. అంతర్జాతీయ విమాన సర్వీసుల ఏటీఎఫ్ ధరలు మాత్రం రూ.73 వేలు పెంచారు. మే నెలలో అంతర్జాతీయ విమానాలకు ఏటీఎఫ్ ధరను కిలో లీటరుకు 76 డాలర్లు పెంచి 1511 డాలర్లుకు చేర్చారు. దేశీయ విమానాల ధరల్లో అప్పుడు ఏ మార్పూ చేయలేదు. జూన్లో మాత్రం కిలో లీటరుకు 400 డాలర్లు తగ్గించడం గమనార్హం. సాధారణంగా ఎయిర్లైన్స్ నిర్వహణ వ్యయంలో జెట్ ఫ్యూయల్కే 40 శాతం ఖర్చవుతుంది. ఇటీవలి పరిస్థితుల కారణంగా ఇది 55-60 శాతానికి పెరిగింది. పెరిగిన చమురు ధరలకు తోడు, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం వల్ల సాధారణంగా ఎయిర్లైన్స్ నిర్వహణ వ్యయంలో జెట్ ఫ్యూయల్కే 40 శాతం ఖర్చవుతుంది. ఇటీవలి పరిస్థితుల కారణంగా ఇది 55-60 శాతానికి పెరిగింది. పెరిగిన చమురు ధరలకు తోడు, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం వల్ల విమానాలు సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ప్రముఖ విమానయాన సంస్థలు టికెట్ ధరపై సర్ఛార్జి విధించడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఎయిరిండియా జూన్-ఆగస్టు మధ్య తన అంతర్జాతీయ విమాన సర్వీసులను 27 శాతం మేర తగ్గించింది. ఏటీఎఫ్ తగ్గింపు నిర్ణయం ఆయా సంస్థలకు ఊరట కలగనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics.