
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆదివారం రాత్రి తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎప్పటిలాగే ట్రోఫీల కోసం ఆరాటపడే విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కేవలం 42 బంతుల్లోనే తన ఐపీఎల్ కెరీర్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసి, 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతను చూపిన ప్రభావానికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది. కోహ్లీ, రోహిత్, ధోనీ, జడేజా వంటి భారతీయ దిగ్గజాలు ఎన్నో సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నారు. ఎంఎస్ ధోనీ అయితే మొత్తం 19 సీజన్లలో 18 సీజన్లు ఆడాడు. ఈ ఆటగాళ్లందరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చాయి. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పుడూ ఒకే పట్టుదలతో, అద్భుతమైన ప్రదర్శనతో, నిరంతర ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. తన కెరీర్ చివరి దశలో అతను తనను తాను ఒక "ట్రోఫీ వేటగాడు"గా మార్చుకున్నాడు. కోహ్లీ ఎందుకు ప్రత్యేకం..? టీ20 క్రికెట్లో నిలకడకి కోహ్లీనే ఒక కొలమానం. ఇప్పటివరకు 283 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 9,336 పరుగులు చేశాడు. సమయానికి తగ్గట్టు తన ఆటను మార్చుకుంటూనే ఉన్నాడు. 2026 సీజన్లో అతని స్ట్రైక్ రేట్ 165.85గా ఉంది. ఇది అతను అద్భుతంగా రాణించిన 2016 సీజన్ కంటే కూడా ఎక్కువ. అతనితో పాటు ఆడుతున్న రోహిత్ శర్మ (7,329 పరుగులు), ఎంఎస్ ధోనీ (5,439 పరుగులు) లతో పోలిస్తే కోహ్లీ చాలా ముందున్నాడు. చేజ్‌మాస్టర్ (కోహ్లీ) వర్సెస్ హిట్ మ్యాన్ (రోహిత్) కోహ్లీ, రోహిత్‌ల ఆటను గమనిస్తే వారిద్దరి మధ్య ఉన్న తేడాలు స్పష్టంగా తెలుస్తాయి. కోహ్లీ ఐపీఎల్లో 68 సార్లు యాభై కంటే ఎక్కువ పరుగులు (50+) చేశాడు. కోహ్లీ, రోహిత్‌ల ఆటను గమనిస్తే వారిద్దరి మధ్య ఉన్న తేడాలు స్పష్టంగా తెలుస్తాయి. కోహ్లీ ఐపీఎల్లో 68 సార్లు యాభై కంటే ఎక్కువ పరుగులు (50+) చేశాడు. రోహిత్ శర్మ మాత్రం 49 సార్లు మాత్రమే ఈ మార్కును దాటాడు. అలాగే కోహ్లీ ఖాతాలో 9 ఐపీఎల్ సెంచరీలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌కు ఆడిన రోహిత్‌తో పోలిస్తే.. ఆర్సీబీ కోసం ఆడిన కోహ్లీ భారీ పరుగులు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. గత 10 ఏళ్లలో కోహ్లీ కేవలం రెండు సీజన్లలో మాత్రమే 300 కంటే తక్కువ పరుగులు చేశాడు. కానీ.. 2024లో 741 పరుగులు, ఈ 2026లో 675 పరుగులు చేసి దుమ్ములేపాడు. మరోవైపు రోహిత్ శర్మ 2017లో తొడ గాయం తర్వాత పునరాగమనం చేసి, 4వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ప్రారంభించినప్పటి నుండి అతని ఆట తీరు తగ్గడం మొదలైంది. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను పదే పదే అవుట్ అవుతూ వచ్చాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరికీ 10 సీజన్ల క్రితం జరిగిన 2016 సీజన్ చాలా ప్రత్యేకమైనది. కోహ్లీ కెరీర్లోనే కాకుండా టీ20 చరిత్రలోనే అది అత్యుత్తమ సీజన్. ఆ ఏడాది కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఒంటిచేత్తో ఆర్సీబీని ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. దాదాపు పదేళ్లు గడిచినా కోహ్లీ ఇంకా భారీ స్కోర్లు చేస్తూనే ఉన్నాడు. అతని కెరీర్ యావరేజ్ 40 కంటే ఎక్కువగా ఉంది. ఇంతకాలం పాటు అదే ఫామ్‌ను కొనసాగించడం, మారుతున్న క్రికెట్‌కు తగ్గట్టు తన ఆటను మార్చుకోవడం ఎవరికైనా చాలా కష్టం. దీనికి భిన్నంగా రోహిత్ శర్మ కెరీర్లో 2016 సీజన్ ఒక మంచి గుర్తింపు తెచ్చింది. ఓపెనర్‌గా, కెప్టెన్‌గా బాధ్యతలు ఉన్నప్పుడు అతను బాగా ఆడాడు. ఆ ఏడాది 5 హాఫ్ సెంచరీలతో, 44.45 యావరేజ్‌తో 489 పరుగులు చేశాడు. రోహిత్ కెరీర్లో ఇది ఒక అత్యుత్తమ బ్యాటింగ్ సీజన్. కోహ్లీ మైదానంలో గర్జిస్తే.. అది బెంగళూరు చిన్నస్వామి స్టేడియమే కానక్కర్లేదు, ముంబైలోని వాంఖడే స్టేడియం అయినా సరే అభిమానులు ఊగిపోతారు. సచిన్ టెండూల్కర్ లాగే కోహ్లీకి కూడా దేశవ్యాప్తంగా అశేష ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత కొన్నేళ్లుగా కోహ్లీ ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. గతంలో అతను పరుగులు, రికార్డులు, ఆర్సీబీ బ్యాటింగ్‌ను నడిపించడంపైనే దృష్టి పెట్టేవాడు. కానీ ఇప్పుడు అతను కేవలం ట్రోఫీలు గెలవడం గురించే మాట్లాడుతున్నాడు. ఆ మార్పు ఈ ఫైనల్ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. అహ్మదాబాద్‌లో అతను చేసిన 75 పరుగులు పదేళ్ల క్రితం నాటి అతని ఆట తీరుకు భిన్నంగా ఉన్నాయి. మొదటి నుంచే చాలా వేగంగా ఆడి, నాటౌట్‌గా నిలిచి జట్టుకు కప్పు అందించాడు. గతంలో ఆర్సీబీ జట్టు కేవలం కోహ్లీ, ఏబీ డివిలియర్స్ మీదే ఆధారపడుతుందని విమర్శలు వచ్చేవి. రికార్డులు సృష్టించినా కప్పులు గెలవలేకపోయారు. ఇప్పుడు రెండోసారి టైటిల్ గెలవడంతో, కేవలం రికార్డుల గురించే కాకుండా కప్పులు గెలవడం ద్వారానే తన కెరీర్‌ను అంచనా వేయాలనే కోహ్లీ మాట నిజమైంది. ప్రస్తుతం