తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జోసెఫ్ విజయ్ మొదటిసారి ప్రజల మధ్యకు వచ్చారు. సోమవారం ఆయన తిరుచ్చి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తనను మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో పోల్చొద్దని సూచించారు. అలాగే, రాష్ట్రంలో పోరు కేవలం టీవీకే, డీఎంకే పార్టీల మధ్యే జరుగుతోందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అన్నారు. డీఎంకే ‘కుటుంబ రాజకీయాలను’ ప్రోత్సహిస్తోందని విజయ్ దుయ్యబట్టారు. టీవీకే ప్రభుత్వం ప్రజలందరి కోసం ఉంటుందని, రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎటువంటి రాజీ ఉండదని విజయ్ స్పష్టం చేశారు. తన పార్టీపై వచ్చిన ఎమ్మెల్యేల బేరసారాల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అంతేకాదు, డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని’ ఆరోపించారు.‘‘ఇప్పటికీ నేను రాజకీయంగా ఇదే చెబుతున్నాను.. పోటీ కేవలం రెండు పార్టీల మధ్యే ఉంది.. ఒకటి డీఎంకే, మరొకటి టీవీకే. మరే ఇతర పార్టీకి పాత్ర గానీ, స్థానం గానీ లేదు.. నేను బాధ్యతలు స్వీకరించి కొన్ని వారాలు మాత్రమే గడిచాయి.. అయినా ఆరు నెలల పాటు మౌనంగా ఉంటామని చెప్పిన వారు ఆరు రోజులు కూడా మౌనంగా ఉండలేకపోయారు. ఇన్నేళ్లుగా మిమ్మల్ని వంతులవారీగా మోసం చేస్తున్న ఆ ఇద్దరినీ తిరస్కరించి, మీ కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చిన మీ విజయ్ను, మీ అన్నయ్యను, మీ తమ్ముడిని ఎన్నుకుని, ముఖ్యమంత్రిగా కాకుండా మీ మొదటి సేవకుడిగా చేసుకున్నారు’’ అని ఆయన అన్నారు.అలాగే, తన వస్త్రధారణను ఎందుకు రాజకీయం చేస్తున్నారని విజయ్ మండిపడ్డారు. ‘‘నేను సూట్ ఎందుకు వేసుకోకూడదా? ఈ మధ్య దీని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు... మనం కోటు, సూట్ వేసుకోకూడదా? అది కేవలం అధికార స్థానాల్లో ఉన్నవారికి మాత్రమేనా? అలాంటిదేమీ లేదు. నేను ఎక్కువ రంగులు తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జోసెఫ్ విజయ్ మొదటిసారి ప్రజల మధ్యకు వచ్చారు. సోమవారం ఆయన తిరుచ్చి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తనను మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో పోల్చొద్దని సూచించారు. అలాగే, రాష్ట్రంలో పోరు కేవలం టీవీకే, డీఎంకే పార్టీల మధ్యే జరుగుతోందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అన్నారు. డీఎంకే ‘కుటుంబ రాజకీయాలను’ ప్రోత్సహిస్తోందని విజయ్ దుయ్యబట్టారు. టీవీకే ప్రభుత్వం ప్రజలందరి కోసం ఉంటుందని, రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎటువంటి రాజీ ఉండదని విజయ్ స్పష్టం చేశారు. తన పార్టీపై వచ్చిన ఎమ్మెల్యేల బేరసారాల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అంతేకాదు, డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని’ ఆరోపించారు.‘‘ఇప్పటికీ నేను రాజకీయంగా ఇదే చెబుతున్నాను.. పోటీ కేవలం రెండు పార్టీల మధ్యే ఉంది.. ఒకటి డీఎంకే, మరొకటి టీవీకే. మరే ఇతర పార్టీకి పాత్ర గానీ, స్థానం గానీ లేదు.. నేను బాధ్యతలు స్వీకరించి కొన్ని వారాలు మాత్రమే గడిచాయి.. అయినా ఆరు నెలల పాటు మౌనంగా ఉంటామని చెప్పిన వారు ఆరు రోజులు కూడా మౌనంగా ఉండలేకపోయారు. ఇన్నేళ్లుగా మిమ్మల్ని వంతులవారీగా మోసం చేస్తున్న ఆ ఇద్దరినీ తిరస్కరించి, మీ కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చిన మీ విజయ్ను, మీ అన్నయ్యను, మీ తమ్ముడిని ఎన్నుకుని, ముఖ్యమంత్రిగా కాకుండా మీ మొదటి సేవకుడిగా చేసుకున్నారు’’ అని ఆయన అన్నారు.అలాగే, తన వస్త్రధారణను ఎందుకు రాజకీయం చేస్తున్నారని విజయ్ మండిపడ్డారు. ‘‘నేను సూట్ ఎందుకు వేసుకోకూడదా? ఈ మధ్య దీని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు... మనం కోటు, సూట్ వేసుకోకూడదా? అది కేవలం అధికార స్థానాల్లో ఉన్నవారికి మాత్రమేనా? అలాంటిదేమీ లేదు. నేను ఎక్కువ రంగులు వేసుకోలేదు. మనందరి హృదయాల్లాగే ఇది కూడా కేవలం నలుపు, తెలుపు మాత్రమే. నలుపు, తెలుపులాగే నేను కూడా అన్ని విషయాల్లో పారదర్శకంగా, నిరాడంబరంగా ఉంటానని చెప్పడానికే ఈ రంగులను ఎంచుకున్నాను...ఇక నలుపు రంగు దేనికి సంకేతం, అది ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుందనే విషయానికొస్తే, దాని గురించి నేను వివరించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను... ఎందుకంటే అందరికీ తెలుసు. నేను సుదీర్ఘ వివరణలు ఇచ్చే లేదా అనవసరంగా మాట్లాడే వ్యక్తిని కాదు. అందరికీ తెలిసినట్లుగా నేను చాలా సమావేశాల్లో సాధారణంగా 20 నిమిషాల కంటే తక్కువసేపే మాట్లాడతాను. ‘మీరు మా కోసం పని చేయడానికి ఇక్కడికి వచ్చారు, కాబట్టి ఆ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ గురించి మాట్లాడే వారిని మేమే చూసుకుంటాం’ అని ప్రజలు నాతో చెబుతుంటారు’’ అని ఆయన అన్నారు.రెండు స్థానాల్లో గెలిచిన విజయ్.. తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన విజయ్ సీఎంగా మొదటి పర్యటనను ఆ జిల్లాను ఎంచుకున్నారు. విజయ్ సభకు భారీగా జనం హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జోసెఫ్ విజయ్ మొదటిసారి ప్రజల మధ్యకు వచ్చారు. సోమవారం ఆయన తిరుచ్చి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తనను మాజీ...