
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. AP Pension Scheme 2026 Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు వీలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఈ మేరకు అర్హతలు, సమర్పించాల్సిన పత్రాల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. సచివాలయంలో దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అర్హులకు పెన్షన్లను ఖరారు చేస్తారు. పెన్షన్‌కి కావాల్సిన పత్రాలు.. ఈ విడతలో ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా, వికలాంగుల పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అన్ని రకాల పెన్షన్లకు కావలసిన 5 రకాల ప్రాథమిక పత్రాలతో పాటు, ఆయా కేటగిరీలను బట్టి క్రింది అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా 60 ఏళ్లు పైబడి వయసు ఉండాలి. అలాగే వితంతువు పెన్షన్ కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వీరితో పాటు ఒంటరి మహిళల పెన్షన్ పొందే వారు తప్పనిసరిగా కోర్టు ద్వారా భర్త నుంచి విడాకులు పొందిన సర్టిఫికేట్ ఉండాల్సిందే. మరోవైపు వికలాంగుల వృద్ధాప్య పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా 60 ఏళ్లు పైబడి వయసు ఉండాలి. అలాగే వితంతువు పెన్షన్ కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వీరితో పాటు ఒంటరి మహిళల పెన్షన్ పొందే వారు తప్పనిసరిగా కోర్టు ద్వారా భర్త నుంచి విడాకులు పొందిన సర్టిఫికేట్ ఉండాల్సిందే. మరోవైపు వికలాంగుల పెన్షన్ దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్లు వైద్యుల జారీ చేసిన ఆధీకృత సదరం (SADAREM) సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ 5 పత్రాలు తప్పనిసరి! ఏ పెన్షన్‌కు దరఖాస్తు చేయాలన్నా అభ్యర్థులు క్రింది 5 రకాల డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అర్హత కలిగిన వారు ఈ నెల 12వ తేదీన అవసరమైన అన్ని పత్రాలతో మీ సమీప సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read: రెండు విడతల్లో జమిలి ఎన్నికలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే? Also Read: Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం..2-3 రోజుల్లో వానలే వానలు! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి...