
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Benefits Of Using Porridge For Hair Health: అందం అంటే కేవలం ముఖం మాత్రమే కాదు.. ఒత్తయిన, ఆరోగ్యవంతమైన జుట్టు కూడా. ఆడవాళ్లకి జుట్టు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హెల్తీ హెయిర్ కోసం ఎన్నో రకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు. కాస్ట్లీ షాంప్స్, ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యలు ఎక్కువవుతున్నాయి. పొగ, దుమ్ము, ధూళి కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యం కోసం గంజి ఎంతో బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది. మరి జుట్టుకి గంజి వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ గంజి అంటే ఏంటి? గంజి అనేది అన్నాన్ని ఉడికించేటప్పుడు మిగిలే నీరు. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు, ఖనిజాలు ముఖ్యంగా ఇనాసిటోల్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యానికి గంజి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. 1. జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది గంజిలో ఉండే ఇనాసిటోల్ అనే పదార్థం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇది స్కాల్ప్ లో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. 2. జుట్టు తేలికగా, సాఫ్ట్‌గా మారుతుంది గంజిని జుట్టుకు పూయడం వల్ల జుట్టు నిగారుగా, సున్నితంగా మారుతుంది. ఇది సహజ కండీషనర్‌లా పనిచేస్తుంది. కానీ, హెయిర్ కండీషనర్ లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి జుట్టును డ్యామేజ్ 2. జుట్టు తేలికగా, సాఫ్ట్‌గా మారుతుంది గంజిని జుట్టుకు పూయడం వల్ల జుట్టు నిగారుగా, సున్నితంగా మారుతుంది. ఇది సహజ కండీషనర్‌లా పనిచేస్తుంది. కానీ, హెయిర్ కండీషనర్ లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి జుట్టును డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి గంజి మంచి ఫలితాన్ని ఇస్తుంది. 3. జుట్టు రాలడం తగ్గుతుంది గంజి స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు జుట్టు రూట్లకి బలాన్ని అందిస్తుంది. కాబట్టి జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. 4. డాండ్రఫ్ తగ్గిస్తుంది గంజిలో ఉండే శీతలత లక్షణాలు స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుతూ, పొడిబారిన చర్మాన్ని తేమగా మారుస్తాయి. దీనివల్ల పొడిబారిన స్కిన్ తేమగా మారి డాండ్రఫ్ తగ్గుతుంది. దాని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. 5. జుట్టుకు మెరుపుని ఇస్తుంది గంజిని తరచూ వాడడం వల్ల జుట్టు సహజంగా మెరిసిపోతుంది. ఇది జుట్టులో పొడిగా కనిపించే రూపాన్ని తగ్గిస్తుంది. 6. కెమికల్ ఫ్రీ, సహజమైన హెయిర్ ట్రీట్మెంట్ మార్కెట్ లో లభ్యమయ్యే హెయిర్ కండీషనర్లు అధికంగా కెమికల్స్‌తో నిండి ఉంటాయి. కానీ, గంజి మాత్రం పూర్తిగా సహజమైనది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. గంజిని జుట్టుకు ఎలా అప్లయ్ చేసుకోవాలి..? అన్నం మరిగించిన తర్వాత మిగిలిన గంజిని గట్టిగా వడకట్టాలి. దాన్ని చల్లార్చి, తల స్నానం చేసిన తర్వాత గంజితో తలను కడగాలి. అలా 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకోవాలి. తరువాత సాధారణ నీటితో కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. Also Read: బ్రౌన్ రైస్‌లో దాగున్న పోషకాల ఖజానా.. షుగర్ నుంచి గుండె వరకు రక్షణ! Also Read: గుండె ఆరోగ్యం కోసం సూపర్ ఫుడ్.. రోజు ఉదయం తింటే హార్ట్ ఎటాక్ నుంచి జాగ్రత్తపడొచ్చు! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి