
Femina George In Raaka News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం 'రాకా'. ఈ సినిమాలో మరో హీరోయిన్గా మలయాళీ బ్యూటీని ఎంపిక చేశారట. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'పుష్ప' సిరీస్‌లోని రెండు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సైన్స్-ఫిక్షన్ సినిమా 'రాకా' నుంచి ఓ స్పెషల్ అప్డేట్ బయటకొచ్చింది. ఇందులో దీపికా పదుకొణెతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక, భాగ్యశ్రీ భోర్సే వంటి వారు మరో హీరోయిన్గా నటిస్తున్నారని పుకార్లు వచ్చాయి. కానీ, చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఫెమినా జార్జ్..'రాకా' సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ సినిమాలో అవకాశం రావడం పట్ల ఆమెకు చెప్పలేనంత ఖుషీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అల్లు అర్జున్ ఈ సినిమాలో కథానాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇందులో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఓ హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్.. దాదాపుగా రూ.800 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్వాలిటీ విషయంలో హాలీవుడ్‌కు తగ్గట్టుగా నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమాలో అల్లు అర్జున్ 3 నుంచి 4 గెటప్స్‌లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడని సమాచారం. ఇదే నిజమైతే అల్లు ఫ్యాన్స్‌కు ఇక సినిమాలో అల్లు అర్జున్ 3 నుంచి 4 గెటప్స్‌లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడని సమాచారం. ఇదే నిజమైతే అల్లు ఫ్యాన్స్‌కు ఇక పండగే. Femina George In Raaka News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం 'రాకా'. ఈ సినిమాలో మరో హీరోయిన్గా మలయాళీ బ్యూటీని ఎంపిక చేశారట. అందుకు...