
హైదరాబాద్: రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్ వేదికగా జూన్ 2న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం’ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. దీనిపై శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లూరి రామ్ జూన్ 2న సంధ్య కన్వెన్షన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 2 వేల మంది కార్యకర్తలతో నిర్వహించాలనుకున్న జనసేన సాధకుల సమావేశానికి అనుమతి కోరినట్లు చెప్పారు. ‘‘సమావేశం అనుమతి విషయంపై దర్యాప్తు చేశాం. ఏపీలో ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యాఖ్యలపై నమోదైన కేసులు, వాటి కారణంగా తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, అలాగే కొందరు ఏపీ రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని దర్యాప్తులో తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, వ్యతిరేక ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమయంలో ఈ సమావేశం వల్ల భారీ స్థాయిలో నిరసనలు, ప్రదర్శనలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడొచ్చు. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. మరోవైపు, సమావేశానికి వచ్చే సుమారు 2 వేల మంది కోసం సరిపడా పార్కింగ్ సదుపాయం లేదని వేదిక యాజమాన్యం ధ్రువీకరించింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జనసేన సమావేశానికి అనుమతి నిరాకరించాం’’అని డీసీపీ తెలిపారు. జనసేన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై జనసేన నేత మహేందర్రెడ్డి జనసేన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై జనసేన నేత మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. తాము సభ పెట్టట్లేదని, సమావేశం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. కన్వెన్షన్ సెంటర్లలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంపై పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది.. అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతి నిరాకరించారని, సమావేశం అనుమతి కోసం కోర్టును ఆశ్రయించామని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. పెనుకొండ, చిన్న కొత్తపల్లి ప్రాంతాల్లో వర్షం కురవడంతో.. వరద నీరు ధర్మవరం చెరువుకు చేరుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదోతరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) గెలవడంతో కర్నూలులో క్రికెట్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. హైదరాబాద్: రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్ వేదికగా జూన్ 2న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం’ సభకు...