
itel Aqua Mobile : ఐటెల్ కొత్త ఇన్నో సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద కంపెనీ ఐటెల్ ఆక్వా ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో IP67 రేటింగ్‌తో వస్తున్న ఏకైక ఫీచర్ ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఈ ఐటెల్ ఫోన్ వాటర్, డస్ట్ నుంచి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే, ఈ ఫోన్లో ఏఐ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్ కూడా ఉంది. సౌండ్, నాయిజ్ ఎక్కువగా ఉండే వాతావరణంలో కాలింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. కంపెనీ ప్రకారం.. రోజువారీ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కొత్త ఇన్నో సిరీస్‌ను రూపొందించారు. ధర, లభ్యత విషయానికి వస్తే.. ఐటెల్ ఆక్వా ఫోన్ ధర రూ. 1,799గా ఉంది. ఈ ఫీచర్ ఫోన్ బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో నుంచి కొనుగోలు చేయవచ్చు. 30 నిమిషాలు నీటిలో మునిగినా.. : దాదాపు 42 శాతం ఫీచర్ ఫోన్లు నీళ్లలో తడిసి పాడైన కారణంగానే యూజర్లు మార్చేస్తున్నారని తమ ఇంటర్నల్ సర్వేలో తేలిందని ఐటెల్ ప్రకటనలో పేర్కొంది. అందుకే ఐటెల్ ఆక్వాకు IP67 రేటింగ్ అందిస్తోంది. ఈ ఐటెల్ ఫోన్ 30 నిమిషాల వరకు నీటిలో మునిగినా తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. దుమ్ము, బురద, తేమతో కూడిన వాతావరణంలో కూడా ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది. Read Also : Vivo X Fold 6 : వివో లవర్స్ కోసం 200MP కెమెరాతో వివో X ఫోల్డ్ 6 వచ్చేస్తోంది.. శాంసంగ్, హానర్ ఫోన్లకు దబిడి దిబిడే.. కాలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫోన్లో ఏఐ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ Telugu » Technology » Itel Aqua Brings Ip67 Water And Dust Resistance To The Feature Phone Segment కాలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫోన్లో ఏఐ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్ ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ టెక్నాలజీ మార్కెట్లు, ఫ్యాక్టరీలు, నిర్మాణ స్థలాలు, ట్రాఫిక్ వంటి సౌండ్ ఆధారిత వాతావరణాలలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. తద్వారా కాల్స్ సమయంలో వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. ఐటెల్ ఆక్వా 2.4-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. 1200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ధర రేంజ్లో ఫీచర్ ఫోన్లలో టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కంపెనీ చేర్చింది. యాక్సెసిబిలిటీ ఫీచర్లలో కింగ్ వాయిస్ ఫీచర్ ఉంది. మెనూలు, మెసేజ్, కాల్ డేటా, హిందీ, ఇంగ్లీషులో వాయిస్ ద్వారా అందిస్తుంది. ఈ ఫోన్ 10 ప్రాంతీయ భాషలకు కూడా సపోర్టు ఇస్తుంది. ఐటెల్ ఇతర ఫీచర్లలో వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, ఎఫ్ఎమ్ రికార్డింగ్, ఆటో కాల్ రికార్డింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, 32GB వరకు స్టోరేజ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌బుక్‌లో 1,000 కాంటాక్ట్‌ల వరకు స్టోర్ చేయవచ్చు. ప్రైమరీ కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ ఫీచర్లతో పాటు స్ట్రాంగ్ డిజైన్‌ను కోరుకునే యూజర్ల కోసం ఈ ఐటెల్ ఫోన్ డిజైన్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. itel Aqua Mobile : ఐటెల్ కొత్త ఇన్నో సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద కంపెనీ ఐటెల్ ఆక్వా ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో IP67 రేటింగ్‌తో...