
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలవడం వెనుక ఉన్న రహస్యాన్ని హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ వివరించాడు. 2025లో తొలి టైటిల్ గెలిచినప్పటి ఉద్విగ్నభరిత వాతావరణానికి, 2026లో టైటిల్‌ను నిలబెట్టుకున్నప్పటి నిలకడైన ప్రదర్శనకు మధ్య ఉన్న తేడాను ఫ్లవర్ విశ్లేషించాడు. ఈసారి జట్టులో ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఉండటమే తమ విజయానికి ప్రధాన కారణమని స్పష్టం చేశాడు. సోమవారం జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో ఫ్లవర్ మాట్లాడుతూ, 2024 సీజన్లో ఎదురైన కఠిన సవాళ్లే తమను బలోపేతం చేశాయని అన్నాడు."2025, 2026 టైటిల్ విజయాల మధ్య కచ్చితంగా తేడాలు ఉన్నాయి. అయితే నేను 2024 సీజన్‌ను కూడా గుర్తుచేసుకోవాలి. ఆ ఏడాది తొలి అర్ధభాగంలో ఎదురైన పరాజయాలు మాలో పట్టుదలను పెంచాయి. వ్యూహాత్మకంగా కొన్ని మార్పులు చేసుకోవడానికి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆ పరిస్థితులే కారణం" అని ఫ్లవర్ తెలిపాడు.ఫ్లవర్ ఇంకా వివరిస్తూ, "2025లో తొలిసారి టైటిల్ గెలిచాం. అయితే, ఆర్సీబీకి గతంలో టైటిల్ గెలిచిన అనుభవం లేకపోవడంతో ఆ సీజన్ లో చాలా ఒత్తిడి, అనిశ్చితి ఉండేవి. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఏడాది టైటిల్ గెలిచిన తర్వాత జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండటం కోచింగ్ సిబ్బందిగా మా పనిని సులభతరం చేసింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లేటప్పుడు వారిలో కనిపించిన ఆ నమ్మకమే మమ్మల్ని గెలిపించింది" అని అన్నాడు.జట్టు సంస్కృతే విజయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలవడం వెనుక ఉన్న రహస్యాన్ని హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ వివరించాడు. 2025లో తొలి టైటిల్ గెలిచినప్పటి ఉద్విగ్నభరిత...