అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్ క్రికెట్లో పలు కీలక మార్పులకు ఆమోదముద్ర వేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలలో ముఖ్యమైనది, వెలుతురు మందగించినప్పుడు పింక్ బాల్ వాడకం. టెస్ట్ మ్యాచ్‌లలో వెలుతురులేమి కారణంగా ఆట నిలిచిపోకుండా, పూర్తి ఓవర్లు జరిగేలా చూడటమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.ఈ కొత్త నిబంధన ప్రకారం, టెస్ట్ మ్యాచ్ ఎప్పటిలాగే రెడ్ బాల్‌తో ప్రారంభమవుతుంది. ఒకవేళ ఆట మధ్యలో వెలుతురు తగ్గితే, ఫ్లడ్‌లైట్ల వెలుగులో పింక్ బాల్‌తో ఆటను కొనసాగించవచ్చు. అయితే, సిరీస్ ప్రారంభానికి ముందే ఇరు జట్లు దీనికి అంగీకరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 90 ఓవర్ల ఆటలో 75 ఓవర్లు ముగిశాక వెలుతురు తగ్గితే, మిగిలిన ఓవర్లను పింక్ బాల్‌తో పూర్తి చేస్తారు.దీంతో పాటు మరికొన్ని ముఖ్యమైన నిబంధనలను కూడా ఐసీసీ ఆమోదించింది. ఇకపై డ్రింక్స్ విరామ సమయంలో హెడ్ కోచ్‌లు మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే, బౌలర్ల సందేహాస్పద యాక్షన్‌ను పర్యవేక్షించేందుకు మ్యాచ్ అధికారులు హాక్-ఐ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా ఉన్న లెగ్-సైడ్ వైడ్ల నిబంధనను శాశ్వతం చేశారు.టీ20 మ్యాచ్‌లలో 15 నిమిషాల విరామాన్ని తప్పనిసరి చేసింది. ఆట తిరిగి ప్రారంభమైనప్పుడు బ్యాట్స్‌మెన్ సిద్ధంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు, నిబంధనల ఉల్లంఘన కారణంగా క్రికెట్ కెనడా సభ్యత్వంపై ఐసీసీ తక్షణమే సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, సస్పెన్షన్ కాలంలోనూ కెనడా జాతీయ జట్లు ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలన్నీ 2026 అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్ క్రికెట్లో పలు కీలక మార్పులకు ఆమోదముద్ర వేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలలో ముఖ్యమైనది,...