
చాలా మంది ఆడవాళ్లకు గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం అలవాటుగా ఉంటుంది. దానివల్ల మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కనిపిస్తాయి. హార్మోనల్ గర్భనిరోధక పద్ధతులు టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది లైంగిక కోరికలు తగ్గడానికి కూడా దారితీస్తుంది. గర్భనిరోధక మాత్రల వల్ల కొందరు మహిళలు బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. గర్భనిరోధక మాత్రలు, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఉన్నవి, రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. హార్మోన్ల మార్పులు కొందరు మహిళల్లో మైగ్రేన్‌కు కారణమవుతాయి. దీనివల్ల తరచుగా తలనొప్పి వస్తుంది. కొందరు మహిళలు గర్భనిరోధక మాత్రలు వేసుకున్నప్పుడు వికారం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. ఈ మాత్రల వల్ల కొందరిలో అసాధారణ రక్తస్రావం లేదా ఎక్కువ కాలం బ్లీడింగ్ కావచ్చు. ఇది రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల శరీరంలో బి విటమిన్లు, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు తగ్గిపోతాయి. అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, జుట్టు రాలడం సమస్యలకు దారితీస్తుంది. Silver Plated Bangles: వెండిలా మెరిసే గాజులు..ధర కూడా తక్కువే..! Leaf Design Anklet: మనసు దోచే ఆకుల డిజైన్ పట్టీలు..ఎంత బాగున్నాయో Floral Anklet: పూల డిజైన్ పట్టీలతో పాదాలకే అందం..! Gold Rings: 1 గ్రాము బంగారంలో ఉంగరాలు.. అదిరిపోయే డిజైన్లు చాలా మంది ఆడవాళ్లకు గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం అలవాటుగా ఉంటుంది. దానివల్ల మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కనిపిస్తాయి. హార్మోనల్ గర్భనిరోధక పద్ధతులు టెస్టోస్టెరాన్...