
ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం యువత కేవలం జీతంలో అంకెలెక్కువుంటే సంతోషపడడం లేదు.. జీవితంలోనూ సంతోషం ఉండాలంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల అనుభవమున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికీ వెనకాడడం లేదు. ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం యువత కేవలం జీతంలో అంకెలెక్కువుంటే సంతోషపడడం లేదు.. జీవితంలోనూ సంతోషం ఉండాలంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల అనుభవమున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికీ వెనకాడడం లేదు. కేరళకు చెందిన ఓ యువతి ఇదే కోవకు చెందుతుంది. తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన ఆమె.. ఇప్పుడు ఆటో నడుపుతోంది. ఈ క్రమంలో ఇటీవల డాక్టర్ నెజ్రిన్ మిధ్లాజ్ అనే ఓ వ్యాపారవేత్త కంటపడింది. నెజ్రిన్ ఆ యువతితో మాట కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోకి ఓ క్యాప్షన్ జోడించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది నెజ్రిన్. అది వైరల్‌గా మారడమే కాకుండా.. నెటిజన్ల నుంచి చక్కటి స్పందన అందుకుంటోంది. ‘కొన్నిసార్లు అపరిచితులతో అనుకోకుండా మాట్లాడడం వల్ల స్ఫూర్తిదాయకమైన కథనాలు బయటకు వస్తుంటాయి. నాకు కూడా అలాంటి సంఘటనే ఎదురైంది. ఈ రోజు ఒక మహిళా ఆటో డ్రైవర్‌ను కలిశా. తను చక్కటి వస్త్రధారణతో, నిండైన ఆత్మవిశ్వాసంతో, జీవితంపై స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగా కనిపించింది. దాంతో ఆమెను పలకరించా. పురుషాధిక్య రంగంలో పనిచేయడం ఎలా ఉందని అడిగా. దానికి ఆమె ఇచ్చిన సమాధానంతో మరికొంతసేపు మాట్లాడాలనిపించింది. ‘మేడమ్.. ఇప్పుడు చాలా బాగుంది. మహిళలుగా మనం చాలా ధైర్యవంతులం. మనసు పెడితే ఏదైనా సాధించగలుగుతాం. నేను తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేశా. అయితే తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత, వర్క్ లైఫ్ బ్యాలన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశా. ఆ తర్వాత ఈ ఆటో కొని నడుపుతున్నా. ‘మేడమ్.. ఇప్పుడు చాలా బాగుంది. మహిళలుగా మనం చాలా ధైర్యవంతులం. మనసు పెడితే ఏదైనా సాధించగలుగుతాం. నేను తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేశా. అయితే తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత, వర్క్ లైఫ్ బ్యాలన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశా. ఆ తర్వాత ఈ ఆటో కొని నడుపుతున్నా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. దీని ద్వారా నెలకు సులభంగా 60 వేల రూపాయల వరకు సంపాదించగలుగుతున్నా.. ఖాళీ సమయంలో నాకు నచ్చిన వ్యాపకాలపై దృష్టి పెట్టగలుగుతున్నా..’ అంటూ ఆ మహిళా ఆటో డ్రైవర్ తన గాథను పంచుకుంది. తను అలా చెప్పడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాను. కెరీర్లో ఉన్నత స్థానాలను చేరుకోవడానికి మనం నిరంతరం శ్రమిస్తుంటాం. కానీ, అలా శ్రమించే క్రమంలో నిజంగా మనం సంతోషంగా ఉంటున్నామా? అని మనల్ని మనం ప్రశ్నించుకోం. అయితే, ప్రతి విజయగాథ ఒకేవిధంగా ఉండకపోవచ్చు. కానీ, కొన్నిసార్లు హోదా కంటే ప్రశాంతతను ఎంచుకోవడమే మంచిది. ఇలాంటి వ్యక్తులతో మాట్లాడడం వల్ల నన్ను నేను తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ ఆ మహిళా ఆటో డ్రైవర్ మాట్లాడిన వీడియోని పంచుకుంది నెజ్రిన్. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి చక్కటి స్పందన వస్తోంది. తన సంతోషం కోసం ఆ యువతి ధైర్యవంతమైన నిర్ణయం తీసుకుందని.. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమంటూ పలువురు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. తను పోస్ట్ చేసిన వీడియోకి చక్కటి ఆదరణ రావడంతో.. సోషల్ మీడియా గురించి మరో పోస్ట్ చేసింది నెజ్రిన్. ఈ సందర్భంగా.. ‘సోషల్ మీడియా.. ప్రతిసారీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఈ వీడియోని పంచుకోవాలని నేను ప్లాన్ చేయలేదు. కానీ, అది వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాలు శక్తిమంతమైనవని మరోసారి రుజువైంది. ఈ ఒక్క వీడియో ఊహించని రీతిలో ఎంతోమందికి చేరువైంది. కొన్నిసార్లు మీ సందేశం ఊహించిన దానికంటే చాలా దూరం వెళ్లగలదు..’ అని చెప్పుకొచ్చింది నెజ్రిన్. దుబాయ్‌కి చెందిన నెజ్రిన్ ఓ విద్యాసంస్థకు సీఈవోగా, పలు స్టార్టప్‌లకు వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆమె టెడెక్స్ స్పీకర్ కూడా. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం