Girl Child Savings Scheme: మనం ఇన్వెస్ట్ చేసేందుకు చాలానే స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఎక్కడ చూసినా.. ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలి.. ఎంత పెట్టుబడి పెట్టాలనేది ఆలోచిస్తాం. పోస్టాఫీస్ పథకాలు/చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఆడపిల్లల కోసం అందుబాటులో ఉన్న గొప్ప పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రధానంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మెచ్యూరిటీ గురించే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ కాల పరిమితి 21 ఏళ్లు కాగా.. ఇది పాప వయసు అనుకొని పొరబడుతుంటారు. అంటే పాప వయసు 21 ఏళ్లు వస్తే.. మెచ్యూరిటీ తీరుతుందనుకుంటారు. కానీ అలా కాదు. అసలు ఇదెలా చూస్తారో చూద్దాం.అమ్మాయి వయసుతో సంబంధం లేకుండా.. ఇక్కడ కాల పరిమితి 21 ఏళ్లుగా ఉంటుంది. అంటే.. పాప పుట్టినప్పుడే అంటే ఏడాదిలోపే చేరితే.. ఇక్కడి నుంచి 21 ఏళ్లకు అంటే.. పాపకు 21 ఏళ్లు వచ్చే సరికి.. మెచ్యూరిటీ తీరుతుంది. అదే.. పాపకు ఐదేళ్ల వయసులో చేరితే.. అక్కడి నుంచి 21 ఏళ్లకు చూస్తారు. అంటే.. పాపకు 26 ఏళ్లు వచ్చాక.. మెచ్యూరిటీ ముగుస్తుందన్నమాట. అదే పదేళ్ల వయసులో చేరితే.. మీ పాపకు.. 31 ఏళ్లు వచ్చాకే ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఇక్కడ పాపకు 25 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు కడుతుండాలి. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల్ని మనం చూద్దాం.పాప పుట్టినప్పుడే ఖాతా తెరిస్తే.. ఉదాహరణకు ఇప్పుడు 2026లో మీ పాప అప్పుడే పుట్టినప్పుడు (ఏడాదిలోపు) సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్ చెేసినట్లయితే.. ఇక్కడి నుంచి 21 ఏళ్లకు అంటే 2047లో మెచ్యూర్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ వరుసగా 15 ఏళ్లు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. మిగతా ఆరేళ్లు డబ్బు Girl Child Savings Scheme: మనం ఇన్వెస్ట్ చేసేందుకు చాలానే స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఎక్కడ చూసినా.. ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలి.. ఎంత పెట్టుబడి పెట్టాలనేది ఆలోచిస్తాం. పోస్టాఫీస్ పథకాలు/చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఆడపిల్లల కోసం అందుబాటులో ఉన్న గొప్ప పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రధానంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మెచ్యూరిటీ గురించే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ కాల పరిమితి 21 ఏళ్లు కాగా.. ఇది పాప వయసు అనుకొని పొరబడుతుంటారు. అంటే పాప వయసు 21 ఏళ్లు వస్తే.. మెచ్యూరిటీ తీరుతుందనుకుంటారు. కానీ అలా కాదు. అసలు ఇదెలా చూస్తారో చూద్దాం.అమ్మాయి వయసుతో సంబంధం లేకుండా.. ఇక్కడ కాల పరిమితి 21 ఏళ్లుగా ఉంటుంది. అంటే.. పాప పుట్టినప్పుడే అంటే ఏడాదిలోపే చేరితే.. ఇక్కడి నుంచి 21 ఏళ్లకు అంటే.. పాపకు 21 ఏళ్లు వచ్చే సరికి.. మెచ్యూరిటీ తీరుతుంది. అదే.. పాపకు ఐదేళ్ల వయసులో చేరితే.. అక్కడి నుంచి 21 ఏళ్లకు చూస్తారు. అంటే.. పాపకు 26 ఏళ్లు వచ్చాక.. మెచ్యూరిటీ ముగుస్తుందన్నమాట. అదే పదేళ్ల వయసులో చేరితే.. మీ పాపకు.. 31 ఏళ్లు వచ్చాకే ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఇక్కడ పాపకు 25 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు కడుతుండాలి. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల్ని మనం చూద్దాం.పాప పుట్టినప్పుడే ఖాతా తెరిస్తే.. ఉదాహరణకు ఇప్పుడు 2026లో మీ పాప అప్పుడే పుట్టినప్పుడు (ఏడాదిలోపు) సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్ చెేసినట్లయితే.. ఇక్కడి నుంచి 21 ఏళ్లకు అంటే 2047లో మెచ్యూర్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ వరుసగా 15 ఏళ్లు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. మిగతా ఆరేళ్లు డబ్బు కట్టనక్కర్లేదు. కానీ దానికి కూడా మీ పెట్టుబడిపై వడ్డీ జమవుతుంటుంది.ఐదేళ్ల వయసులో అకౌంట్ ఓపెన్ చేస్తే.. అదే మీ పాపకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు సుకన్య సమృద్ధి ఖాతా తెరిస్తే.. అక్కడి నుంచి వరుసగా 15 ఏళ్లు కట్టాలి. అప్పుడు మీ పాపకు 20 ఏళ్లు వచ్చే సరికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. మరో ఆరేళ్లు అలా ఉంచాలి. అంటే మీ పాపకు 26 ఏళ్ల వయసు వస్తే.. అప్పుడు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. ఈ మినహాయింపులు తెలుసా? అయితే ఇక్కడ పాపకు 26 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు తీసుకోలేమా అన్న ప్రశ్న తలెత్తొచ్చు. అయితే దానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. అమ్మాయికి 18 ఏళ్లు నిండినా లేదా పదో తరగతి పూర్తయినా.. పైచదువుల కోసం మొత్తం బ్యాలెన్స్ నుంచి 50 శాతం వరకు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. లేదా 18 ఏళ్లు నిండి అమ్మాయి పెళ్లి చేసుకుంటే కూడా.. అప్పుడు అకౌంట్ క్లోజ్ చేసి అప్పటివరకు బ్యాలెన్స్ డబ్బులు తీసుకోవచ్చు.సుకన్య సమృద్ధి స్కీమ్ హైలైట్స్.. ఇది కేవలం ఆడపిల్లల కోసమే అందుబాటులో ఉన్న స్కీమ్. వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 8.20 శాతంగా ఉంది. పాపకు పదేళ్లలోపు వయసులో ఉన్నప్పుడే చేరాలి. వరుసగా 15 ఏళ్లు డబ్బులు కట్టాలి. మెచ్యూరిటీ కాల పరిమితి 21