
Anganwadi Centers: చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-4 లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా విచ్చేసిన రాష్ట్ర మంత్రులు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. Read Also: Singareni Accident Insurance Scheme: సింగరేణిలో కార్మిక కుటుంబాలకు బీమా రక్షణ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాల్లోనే పిల్లలను చేర్పించాలని సూచించారు. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆధునిక సౌకర్యాలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేస్తున్నామని, పిల్లలకు ‘అమ్మ ముద్ద’ పేరుతో అల్పాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేసి ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి వేతనాల పెంపు దిశగా కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు పిల్లలే నిజమైన ఆస్తి అని అన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలను ప్లే స్కూళ్లు, అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు వెయ్యి మందికి హైదరాబాద్ నగరాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఎన్నడూ హైదరాబాద్ చూడని గిరిజనులకు నిరుపేద కుటుంబాలకు పిల్లలే నిజమైన ఆస్తి అని అన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలను ప్లే స్కూళ్లు, అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు వెయ్యి మందికి హైదరాబాద్ నగరాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఎన్నడూ హైదరాబాద్ చూడని గిరిజనులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడంతో పాటు అన్నప్రాసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసి చిన్నారులను ఆశీర్వదించారు. జిల్లా కలెక్టర్ హరిత అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు, అంగన్వాడి టీచర్స్ తో మాట్లాడారు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్వేత శుక్ల, గోలేటి సర్పంచ్ అజ్మీరా బాబురావు, ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి శ్యాం నాయక్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ ఇరుకుల్ల మంగ, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ తిరుపతి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. Cockroach Janata Party: జూన్ 6న భారత్కు రానున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు TGPSC Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు 3 కొత్త నోటిఫికేషన్లు విడుదల గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Kunamneni Sambasiva Rao: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం.. కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు Sathupalli Singareni : సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ప్రమాదం Janasena : తెలంగాణ లో రాజకీయ దుమారం రేపుతున్న పవన్ సభ Ponnam Prabhakar: ఏబీసీడీ రాజకీయాలపై మంత్రి సీరియస్..! Talent Hunt: తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ టాలెంట్ హంట్.. సరికొత్త కార్యక్రమం ప్రకటించిన మహేష్ కుమార్ గౌడ్ TGPSC: టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే! ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బిగ్ అప్డేట్... ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కొత్త యాంటీ డ్రోన్ వ్యవస్థను రంగంలోకి... అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, ప్రత్యేకమైన... అప్పటివరకు ఆ కల్యాణ వేదిక వందలాది మంది బంధుమిత్రుల కోలాహలంతో, నూతన వధూవరుల నవ్వులతో ఎంతో... అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. పల్నాడు జిల్లాకు చెందిన... సాధారణంగా రైలు టికెట్ బుక్ చేసుకోవాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది IRCTC యాప్. కానీ, ప్రస్తుతం... క్రికెట్ ప్రేమికులను గత రెండు నెలలుగా ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 (IPL