
JEE Advanced results Topper: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2026) ఫలితాలను ఐఐటీ రూర్కీ సోమవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ దేశంలోనే టాప్ ర్యాంకర్ (All India Topper) గా నిలిచి సంచలనం సృష్టించారు. ఇక విద్యార్థినుల విభాగంలో అరోహి దేశ్‌పాండే జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకును కైవసం చేసుకున్నారు. Read also: JEE Advanced 2026 Results:జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. ఐఐటీ రూర్కీ ర్యాంక్ కార్డ్ లింక్ ఇదే! ఈ ఏడాది ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థులు క్లీన్ స్వీప్ చేశారు. కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL)లో శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా అదే జోన్‌కు చెందిన కబీర్ చిల్లార్ ద్వితీయ స్థానాన్ని, జతైన్ చాహర్ తృతీయ స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించారు. శుభమ్ కుమార్ సాధించిన ఈ అద్భుత విజయంతో దేశంలోనే ఐఐటీ శిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజస్థాన్‌లోని ‘కోటా’ కోచింగ్ సెంటర్ల హవా మరోసారి నిరూపితమైంది. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై శుభమ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఐఐటీ లక్ష్యంగా సాగిన తన ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, భవిష్యత్తులో ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థులు కఠోర శ్రమ, పట్టుదల, నిరంతర సాధనను నమ్ముకుంటే విజయం తథ్యమని సూచించారు. శుభమ్ తల్లిదండ్రులు కంచన్ మరియు అతని తండ్రి మాట్లాడుతూ.. తమ కుమారుడు మొదటి నుంచి చదువుపై ఎంతో అంకితభావంతో ఉండేవాడని, అధ్యాపకుల సహకారంతోనే ఈ రోజు జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా నిలిచాడని గర్వంగా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై శుభమ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఐఐటీ లక్ష్యంగా సాగిన తన ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, భవిష్యత్తులో ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థులు కఠోర శ్రమ, పట్టుదల, నిరంతర సాధనను నమ్ముకుంటే విజయం తథ్యమని సూచించారు. శుభమ్ తల్లిదండ్రులు కంచన్ మరియు అతని తండ్రి మాట్లాడుతూ.. తమ కుమారుడు మొదటి నుంచి చదువుపై ఎంతో అంకితభావంతో ఉండేవాడని, అధ్యాపకుల సహకారంతోనే ఈ రోజు జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా నిలిచాడని గర్వంగా చెప్తూ ఆనంద బాష్పాలు రాల్చారు. ఈ ఏడాది మే 17న జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి మొత్తం 1,79,694 మంది అభ్యర్థులు హాజరవగా.. వారిలో 56,880 మంది క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించిన వారిలో 10,107 మంది విద్యార్థినులు ఉన్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్ వివరాలను ఉపయోగించి అధికారిక జేఈఈ అడ్వాన్స్డ్ పోర్టల్ ద్వారా స్కోర్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ సమయంలో ఈ స్కోర్‌కార్డ్ తప్పనిసరి కాబట్టి దీనిని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) ద్వారా కౌన్సెలింగ్ మరియు సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మెరిట్ మార్కుల ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలైన బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ వంటి సంస్థల్లో బీటెక్ సీట్లను భర్తీ చేస్తారు. అయితే, ఈ పరీక్షలో ఆశించిన ర్యాంకు రాని విద్యార్థులు నిరాశ చెందకుండా దేశంలోని ఎన్ఐటీలు (NITs), ట్రిపుల్ ఐటీలు (IIITs) మరియు ఇతర ప్రముఖ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రయత్నించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. Aadhaar Card: ఆధార్ జిరాక్స్ కాపీలకు గుడ్ బై.. క్యూఆర్ కోడ్ ద్వారానే వెరిఫికేషన్! Cockroach Janata Party: జూన్ 6న భారత్‌కు రానున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Chhattisgarh : డ్రైవర్ కుమార్తెను పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే Cockroach Janata Party : విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ Lionel Messi statue: కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహం తొలగింపు Historic change in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో చారిత్రాత్మక మార్పు: మూడు దశాబ్దాల తర్వాత మే నెలలో ‘నో కిల్లింగ్స్’! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ ముగింపు వేడుకల్లో ఒకే ఒక్క పేరు... ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బిగ్ అప్డేట్... ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కొత్త యాంటీ డ్రోన్ వ్యవస్థను రంగంలోకి... అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్ రాజకీయాల్లో