
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Janasena Sabha In Telangana: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించేందుకు తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది. రేపు గచ్చిబౌలి వేదికగా జరగాల్సిన 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ'కు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో జనసేన పార్టీ తదుపరి కార్యచరణ ఏమిటంటూ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలను పోలీసులు, అధికార యంత్రాంగం పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక ఉత్సవాలు జరుగుతుండటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సభకు అనుమతి నిరాకరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టుకు జనసేన? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరించడంతో జనసేన ముఖ్య నేతలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేపు ఉదయమే హైకోర్టును ఆశ్రయించాలని జనసేన లీగల్ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సభపై రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. ఈ సభను వ్యతిరేకిస్తూ మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సభపై రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. ఈ సభను వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ తెలంగాణ పర్యటన వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటూ అధికార పక్షం ఆరోపిస్తుండగా, సభను అడ్డుకోవడానికే ప్రభుత్వం కావాలని అనుమతి నిరాకరించిందని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఇప్పుడు 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ' భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు. Also Read: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి! Also Read: రెండు విడతల్లో జమిలి ఎన్నికలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి...