
బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల దివా ఉత్కర్ష అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ '30 అండర్ 30 ఆసియా 2025' జాబితాలో చోటు దక్కించుకుంది. సామాజిక ప్రభావం (సోషల్ ఇంపాక్ట్) విభాగంలో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. భారత్‌లో క్లిష్టమైన ఆరోగ్య సవాళ్లను యువతరం ఎలా ఎదుర్కొంటుందో చెప్పడానికి ఈ గుర్తింపు ఒక నిదర్శనం.ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసిన దివా, తన 13వ ఏట 2021లో 'ప్రాజెక్ట్ సూర్య' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. తన తమ్ముడు సూర్యకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు తేలడంతో, ఆ కుటుంబం పడిన ఆర్థిక, మానసిక ఇబ్బందులే ఈ ప్రాజెక్ట్‌కు స్ఫూర్తినిచ్చాయి. పరిశోధనలో భాగంగా, భారత్‌లో టైప్ 1 డయాబెటిస్ చికిత్సకు మధ్యతరగతి కుటుంబం తమ ఆదాయంలో 18 శాతం ఖర్చు చేయాల్సి వస్తోందని, 80 శాతం కుటుంబాలకు ప్రభుత్వ సబ్సిడీలు లేదా ఆరోగ్య బీమా అందడం లేదని దివా తెలుసుకుంది. సరైన నిర్ధారణ లేక 2022లో 35,860 మంది ప్రాణాలు కోల్పోయారనే వాస్తవం ఆమెను మరింత చలింపజేసింది.తక్కువ కాలంలోనే 'ప్రాజెక్ట్ సూర్య' ద్వారా దివా అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 4,02,000 మందికి అవగాహన కల్పించి, 3,190 మంది చిన్నారులకు ప్రత్యక్షంగా సహాయం అందించించారు. గ్రాంట్లు, భాగస్వామ్యాల ద్వారా రూ. 20 లక్షలకు పైగా నిధులు సమీకరించారు. 4,500 ఇన్సులిన్ వయల్స్, 2,500 గ్లూకోజ్ మానిటరింగ్ స్ట్రిప్స్, 1,000 ఇన్సులిన్ సిరంజిలను విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా, 200 బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల దివా ఉత్కర్ష అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ '30 అండర్ 30 ఆసియా 2025' జాబితాలో చోటు దక్కించుకుంది. సామాజిక ప్రభావం (సోషల్ ఇంపాక్ట్)...