India-Nepal border| ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌తో కొన్ని దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు అంశాన్ని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సరికొత్తగా రాజేశారు (Nepal PM Balendra Shah). అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు సొంతదేశం నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీపై నెలకొన్న వివాదం గురించి ఆయన స్పందిస్తూ.. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదని, భారత భూభాగాలనూ నేపాల్ ఆక్రమించిందన్నారు. ప్రధాని అయ్యాకే తనకీ విషయం తెలిసిందన్నారు. దీంతో నేపాల్ సార్వభౌమత్వంపై రాజీపడే ధోరణిలో బాలేంద్ర షా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అసలు ఇంతకీ ఈ వివాదం ఎక్కడ మొదలైంది..? (India-Nepal border) భారత్-నేపాల్-చైనా ట్రైజంక్షన్ సమీపంలో ఉన్న మారుమూల హిమాలయ ప్రాంతం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. 1816లో ఆంగ్లో-నేపాల్ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ, నేపాల్ మధ్య సుగౌలీ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం.. కాళి (మహాకాళి) నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా పేర్కొన్నారు. అయితే ఆ నది ఎక్కడ జన్మించింది లేదా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనే వనరును మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. ఆ నది లింపియాధురా నుంచి ఉద్భవిస్తోందనేది నేపాల్ వాదన. కాబట్టి దానిని ఆనుకొని ఉన్న కాలాపానీ, లిపులేఖ్, ఇతర ప్రాంతాలు నేపాల్ (Nepal)లోనివేనని ఆ దేశం వాదిస్తోంది. కాబట్టి అక్కడ ఎలాంటి నిర్మాణాలు, వ్యాపార కార్యకలాపాలు చేపట్టకూడదని చెప్తోంది. అయితే.. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ సమీపంలోని నీటి బుగ్గల నుంచి ఈ కాళీ నది ఉద్భవిస్తోందని, అందుకే 35 కి.మీ. భూభాగం భారత్ పరిధిలోకే వస్తుందని మనదేశం స్పష్టం చేస్తోంది. ఆ మ్యాప్‌ల వాదనను తోసిపుచ్చుతోంది. బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రాంతంపై భారత్‌కు పరిపాలనా నియంత్రణ ఉందని అయితే.. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ సమీపంలోని నీటి బుగ్గల నుంచి ఈ కాళీ నది ఉద్భవిస్తోందని, అందుకే 35 కి.మీ. భూభాగం భారత్ పరిధిలోకే వస్తుందని మనదేశం స్పష్టం చేస్తోంది. ఆ మ్యాప్‌ల వాదనను తోసిపుచ్చుతోంది. బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రాంతంపై భారత్‌కు పరిపాలనా నియంత్రణ ఉందని గుర్తుచేస్తోంది. సరిహద్దుగా నిర్ణయించిన నదికి కాలాపానీ నీటిబుగ్గలే నీటి వనరుగా పరిగణించడం అప్పటినుంచే మొదలైంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినదగ్గరినుంచి ఈ ప్రాంతం భారత్ నియంత్రణలో ఉంది. అయితే టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతం వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. టిబెట్‌కు సమీపంలో ఉండటం, లిపులేఖ్ పాస్ (Lipulekh Pass) ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని భారత్ అక్కడ తన భద్రతను బలోపేతం చేసింది. ఇటీవల కాలంలో నేపాల్ ఈ వివాదాన్ని తరచూ లేవనెత్తుతోంది. 2015లో లిపులేఖ్ పాస్‌పై భారత్-చైనా ఒక అంగీకారానికి రావడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. 2020లో దార్చులా- లిపులేఖ్ రోడ్డు ప్రారంభాన్ని వ్యతిరేకించింది. కైలాశ్ మానససరోవర్ యాత్రను సులభతరం చేసేందుకు ఈ రోడ్డును భారత్ నిర్మించింది. అలాగే లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ తమ భూభాగాలుగా పేర్కొంటూ ఒక మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం. భారత్-చైనా-నేపాల్ కలిసే చోట వ్యూహాత్మక ప్రాంతం ఉంది. ఇది ఎత్తులో ఉంటుంది. కాలాపానీ సెక్టార్‌పై నియంత్రణ సాధించడం వల్ల భారత బలగాలు లిపులేఖ్, టిబెటన్ పీఠభూమికి సమీపంలోని ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వీలుంది. అత్యంత దుర్గమమైన పర్వత ప్రాంతాల్లో సైనిక కదలికలు, లాజిస్టిక్స్, ముందస్తు హెచ్చరికల కోసం ఇటువంటి వ్యూహాత్మక స్థానాలను కీలకమైనవిగా పరిగణిస్తారు. చైనా (China)తో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్‌కు ఇది ఎంతో కీలకమైన ప్రాంతంగా విశ్లేషకులు చెప్తున్నారు. కాఠ్మాండూ: భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు తెలిసిందంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో నేపాల్ విదేశాంగశాఖ రంగంలోకి దిగి బాలేంద్ర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రధాని పదవి చేపట్టిన తరువాత బాలేంద్ర ఆదివారం తొలిసారిగా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్-నేపాల్ సరిహద్దు వివాదం సహా పలు అంశాలపై ఆయనకు విపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలపై నెలకొన్న వివాదం గురించి ఆయన స్పందిస్తూ.. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదని, భారత భూభాగాలనూ నేపాల్ ఆక్రమించిందన్నారు. ప్రధాని అయ్యాకే తనకీ విషయం తెలిసిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి దౌత్య చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని నేపాల్, భారత్ అంగీకారానికి వచ్చాయన్నారు. ఈ అంశాన్ని తాము చైనా, బ్రిటన్ల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బాలేంద్ర వ్యాఖ్యలు నేపాల్ సార్వభౌమత్వంపై రాజీపడే ధోరణిలో ఉన్నాయంటూ ధ్వజమెత్తాయి. దీంతో నేపాల్ విదేశాంగశాఖ స్పందించింది. సరిహద్దును దాటి ఇరువైపులా ఏర్పడిన నివాస ప్రాంతాలు, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్రమణ గురించే ప్రధాని వ్యాఖ్యానించారు తప్ప.. ప్రాదేశిక హక్కులతో ఆయన వ్యాఖ్యలకు సంబంధం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో