
Madhuri Dixit :మాధురి దీక్షిత్ పై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రెగ్నెన్సీ రూమర్లకు ఆమె తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న మాధురి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం ఆమె నటన కాదు..దేవదాస్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక పాత ప్రచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రెగ్నెన్సీ రూమర్లకు ఆమె తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న మాధురి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం ఆమె నటన కాదు.. దేవదాస్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక పాత ప్రచారం. ఇటీవల కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ టీమ్‌కు చెందిన రుబీనా ఖాన్.. దేవదాస్ సినిమాలోని ప్రసిద్ధ ‘డోలా రే డోలా’ పాట షూటింగ్ సమయంలో మాధురి నాలుగు నెలల గర్భిణిగా ఉన్నారని చెప్పినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అభిమానులు కూడా నిజమేనా అంటూ ఆరా తీశారు. ఈ ప్రచారంపై స్పందించిన మాధురి దీక్షిత్.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తన పెద్ద కుమారుడు అరిన్ 2003లో జన్మించాడని, దేవదాస్ సినిమా అయితే 2002లోనే విడుదలైందని గుర్తు చేశారు. ఈ రెండు తేదీలను చూస్తే ప్రచారం పూర్తిగా తప్పని సులభంగా అర్థమవుతుందని తెలిపారు. అయితే దేవదాస్ షూటింగ్ సమయంలో తాను ఆరోగ్యంగా లేకపోవడం మాత్రం నిజమేనని మాధురి వెల్లడించారు. వరుస ప్రయాణాలు, రాత్రి వేళల్లో షూటింగ్‌లు, ఎక్కువసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ కారణంగా అలసటగా ఉండేదని చెప్పారు. కానీ దానికి ప్రెగ్నెన్సీకి అయితే దేవదాస్ షూటింగ్ సమయంలో తాను ఆరోగ్యంగా లేకపోవడం మాత్రం నిజమేనని మాధురి వెల్లడించారు. వరుస ప్రయాణాలు, రాత్రి వేళల్లో షూటింగ్‌లు, ఎక్కువసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ కారణంగా అలసటగా ఉండేదని చెప్పారు. కానీ దానికి ప్రెగ్నెన్సీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మాధురి స్పందనతో చాలా రోజులుగా సోషల్ మీడియాలో తిరుగుతున్న రూమర్లకు చెక్ పడినట్టైంది. ముఖ్యంగా ‘డోలా రే డోలా’ పాట ఇప్పటికీ అభిమానుల ఫేవరెట్‌గా నిలిచిన నేపథ్యంలో.. ఆ పాటకు సంబంధించిన ఈ ప్రచారం మరోసారి చర్చకు రావడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాధురి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. Madhuri Dixit :మాధురి దీక్షిత్ పై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రెగ్నెన్సీ రూమర్లకు ఆమె తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న మాధురి పేరు మరోసారి...