
KTR : రుకో జరా. సబర్ కరో. దూకుడు మంచిదే. కానీ లైన్ దాటొద్దు. టగ్ స్లిప్ కావొద్దు. అటెన్షన్ కోసమో..లేక మీడియాలో హైలెట్ కావడం కోసమో నోరు జారితే అసలుకే ఎసరు వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నాం. కాస్త జాగ్రత్త. ఆచితూచి మాట్లాడండి అంటూ..పార్టీ లీడర్లకు దిశార్దేశం చేశారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏది పడితే అది మాట్లాడి పార్టీని చిక్కుల్లో పడేయొద్దని.. కారు స్పీడుకు బ్రేకులు వేయొద్దని డైరెక్షన్స్ ఇచ్చారట. బాల్క సుమన్ ఎపిసోడ్‌తో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం..దూకుడుగా వెళ్తున్న నేతలను కంట్రోల్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు టాక్. బహిరంగ సమావేశం అయినా..ఇంటర్నల్ మీటింగ్ అయినా..సోషల్ మీడియాలో పోస్ట్ అయినా..కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఏడిపడితే అది మాట్లాడి మీరు చిక్కుల్లో పడొద్దు. పార్టీకి ఇబ్బందులు తీసుకురావద్దు. కారు పార్టీ యువ నేతలకు..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లాస్ తీసుకున్నారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాల్క సుమన్ ఎపిసోడ్‌తో అలర్ట్ అయిన గులాబీ పార్టీ అధిష్టానం దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విమర్శలు ధీటుగా సమాధానం చెప్పాల్సిందే కానీ వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు మాత్రం కంట్రోల్ తప్పొద్దని ఆదేశించినట్లు టాక్. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ వ్యాఖ్యలు, నమోదైన కేసులు, అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశముందని భావించి బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పార్టీ నాయకుల భాష, ప్రజా వేదికలపై వారు చేసే వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువనేతలు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉండే నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా Telugu » Telangana » Gossip Garage Brs Alert With Balka Suman Issue Ktr Key Directions పార్టీ నాయకుల భాష, ప్రజా వేదికలపై వారు చేసే వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువనేతలు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉండే నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా సూచనలు జారీ చేసినట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ యువ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మరీ..ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల విమర్శలకు రాజకీయంగానే ప్రతి స్పందించాలని, అయితే ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, దర్యాప్తు సంస్థలు లేదా పరిపాలనా వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు లైన్ క్రాస్ చేయొద్దని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎం రేవంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే వాటికి రాజకీయంగా ధీటుగా సమాధానం ఇవ్వాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత విమర్శలకు ప్రతి స్పందించే క్రమంలో పార్టీ నాయకులు చట్టపరమైన లేదా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకునేలా వ్యవహరించొద్దని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలపై కేసులు, అరెస్టులు ఎక్కువై పోతుండటంతో..పార్టీ నాయకత్వం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. బాల్క సుమన్ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీయగా, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పోరాటాన్ని మరింత వ్యూహాత్మకంగా కొనసాగించాలని డిసైడ్ అయినట్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇలా దూకుడుగా వెళ్లి వివాదాలు రాజేయడంతో ఆయనకు కళ్లెం వేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే బాల్క సుమన్ వ్యవహారం బీఆర్ఎస్కు రాజకీయంగా ఒక హెచ్చరికగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడే ఉద్దేశంతో నేతలు కంట్రోల్ తప్పి మాట్లాడి కేసుల పాలవకుండా..చట్టపరమైన సమస్యల్లో చిక్కకుండా..వివాదాల జోలికి వెళ్లకుండా చూసేలా పార్టీ అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. Also Read: ఏపీ లానే తెలంగాణలోనూ పవన్ గెలుస్తాడని భయమా?- మంత్రి పొన్నం, కవితకు తెలంగాణ జనసేన కౌంటర్ 10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states. Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd. KTR : రుకో జరా. సబర్ కరో. దూకుడు మంచిదే. కానీ లైన్ దాటొద్దు. టగ్ స్లిప్ కావొద్దు. అటెన్షన్ కోసమో..లేక మీడియాలో హైలెట్ కావడం కోసమో నోరు జారితే అసలుకే ఎసరు వస్తుంది. ప్రతిపక్షంలో...