న్యూఢిల్లీ, జూన్01: జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టిగా హెచ్చరించారు. సోమవారం న్యూఢిల్లీలో జాతీయ రహదారుల నిర్వహణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా, పత్రికల్లో వచ్చిన ప్రజల ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మంత్రి గడ్కరీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల నాణ్యతపై ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రత్యేకంగా చర్చించారు.

ఆంధ్రప్రదేశ్లో 8,512 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్వర్క్పై నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రోడ్డు భద్రతపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల (Black Spots) గుర్తించి.. తక్షణమే నివారణ చర్యలకు ఉపక్రమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి రహదారుల మన్నికను మరింత పెంచాలని అధికారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు

బాల్క సుమన్ కేసులో మరో ట్విస్ట్

For More AP News And Telugu News

న్యూఢిల్లీ, జూన్01: జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ...