
సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో సోమవారం నిర్వహించిన '2026 ఇండియా కాన్ఫరెన్స్'లో ఆయన పాల్గొన్నారు. 'అభివృద్ధికి కొత్త సరిహద్దులు' అనే పేరుతో జరిగిన ఈ సదస్సులో భాగంగా "భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయడం - ఆంధ్రప్రదేశ్ అనుభవం" అనే అంశంపై నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్‌లో లోకేష్ ప్రసంగించారు. కంట్రీ ఎగ్జిక్యూటివ్ విక్రమ్ సాహు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో లోకేష్, రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు.ప్రగతికి మూడు మూలస్తంభాలుఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని లోకేష్ వివరించారు. "మొదటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమర్థ నాయకత్వం. నగరాలను నిర్మించడంలో, పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకప్పుడు సైబరాబాద్‌తో నిరూపించిన ఆయన, ఇప్పుడు అదే దార్శనికతతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు" అని పేర్కొన్నారు. రెండోది, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అని తెలిపారు. "విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ను తీసుకువచ్చాం. గ్రీన్ స్టీల్ రంగంలో దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐలలో ఒకటైన ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును కేవలం 17 నెలల్లోనే ప్రారంభించగలిగాం. ఈ వేగమే మమ్మల్ని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా నిలుపుతోంది" అని అన్నారు. ఇక మూడోది, రాష్ట్రంలో 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' ఉండటమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షిస్తున్న సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా...