
కాగజ్‌నగర్: ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ ఆదివాసీల సొంతింటి కల నెరవేరాలని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున పేదలకు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాగజ్‌నగర్‌లో పర్యటించిన సీఎం.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘తండాలు, గూడేల్లో ఉండే అర్హులైన ఆదివాసీ బిడ్డల కోసం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి నూరు శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి. గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను నేను చూడాలనుకుంటున్నా. రాష్ట్రంలో సెప్టెంబర్ 17న మరో లక్ష గృహప్రవేశాలు చేస్తాం. కొత్తగా మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఈ వేదిక నుంచే మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా. కాళేశ్వరంలో పెట్టిన రూ. లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయి. బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్‌లోని ప్రాజెక్టులను పట్టించుకోలేదు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్‌లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల కోసం మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశాను. అయినా అక్కడి నుంచి స్పందన లేదు. తెలంగాణ సీఎం అంటే మహారాష్ట్ర సీఎంకు ఎందుకుంత చిన్నచూపు? సమస్య పరిష్కరించడానికి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 గ్రామాలను ఏపీలో కలపలేదా? తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రకు కలిగే నష్టాన్ని భరిస్తాం. మహారాష్ట్ర నుంచి 2వేల ఎకరాలు మాత్రమే అడుగుతున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 62లక్షల క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశాం. మొత్తం 75లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటాం. జూన్ 15 నాటికి ఈ కొనుగోళ్లు పూర్తవుతాయి. మేం సేకరించిన వడ్లు, మక్కలు, జొన్నలను కేంద్రం కొనాలి. దీనికి కిషన్‌రెడ్డి సహకారం అందించాలి. వడ్లు కొనకపోతే జూన్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 62లక్షల క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశాం. మొత్తం 75లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటాం. జూన్ 15 నాటికి ఈ కొనుగోళ్లు పూర్తవుతాయి. మేం సేకరించిన వడ్లు, మక్కలు, జొన్నలను కేంద్రం కొనాలి. దీనికి కిషన్‌రెడ్డి సహకారం అందించాలి. వడ్లు కొనకపోతే జూన్ 15 తర్వాత కేంద్రంపై యుద్ధం చేస్తాం’’అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved. Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted. This website follows the DNPA Code of Ethics. కాగజ్‌నగర్: ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ ఆదివాసీల సొంతింటి కల నెరవేరాలని ప్రతి నియోజకవర్గానికి 3,500...