తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో భాగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్ల గృహ ప్రవేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగానే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్‌ను ఆవిష్కరించారు. రెండో విడతలో రాష్ట్రంలో మరో రెండున్నర లక్షల మందికి ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగాలని సూచించారు. అటు లబ్ధిదారులకు, ఇటు అధికారులకు కూడా ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకునేందుకు కొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ టెక్నాలజీతో కేవలం నెల రోజుల్లోనే ఇల్లు నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తండాలు, గూడెంలలో నివసించే అర్హులైన ఆదివాసీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వంద శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను తాను చూడాలనుకుంటున్నానని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్రంలో మరో లక్ష ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన రూ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో భాగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్ల గృహ ప్రవేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగానే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్‌ను ఆవిష్కరించారు. రెండో విడతలో రాష్ట్రంలో మరో రెండున్నర లక్షల మందికి ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగాలని సూచించారు. అటు లబ్ధిదారులకు, ఇటు అధికారులకు కూడా ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకునేందుకు కొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ టెక్నాలజీతో కేవలం నెల రోజుల్లోనే ఇల్లు నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తండాలు, గూడెంలలో నివసించే అర్హులైన ఆదివాసీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వంద శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను తాను చూడాలనుకుంటున్నానని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్రంలో మరో లక్ష ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన రూ. లక్ష కోట్లు గోదావరి నదిలో కలిసిపోయాయని మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి.. ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నో లేఖలు రాసినట్లు గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. అయినా ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. తెలంగాణ సీఎం అంటే మహారాష్ట్ర సీఎంకు ఎందుకు అంత చిన్నచూపు అని ప్రశ్నించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రకు కలిగే నష్టాన్ని తామే భరిస్తామని.. మహారాష్ట్ర నుంచి 2 వేల ఎకరాలు మాత్రమే అడుగుతున్నట్లు చెప్పారు.ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 62 లక్షల క్వింటాళ్ల వడ్లను తమ ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 75 లక్షల క్వింటాళ్ల వడ్లను కొంటామని స్పష్టం చేశారు. ఈనెల 15వ తేదీ నాటికి ఈ కొనుగోళ్లు పూర్తి అవుతాయని తెలిపారు. తాము సేకరించిన వడ్లు, మక్కలు, జొన్నలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్